ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. ఆగిపోయిన ఇమేజ్ జనరేషన్ ఫీచర్.. ఓపెన్ ఏఐ విచారణ
ChatGPT : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న ఏఐలలో చాట్‌జీపీటీ ఒకటి. ఓపెన్ఏఐ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ChatGPT : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న ఏఐలలో చాట్‌జీపీటీ ఒకటి. ఓపెన్ఏఐ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇది తాత్కాలికంగానే ఆగిపోయింది.
చాట్‌జీపీటీలో మిగతా ఫీచర్స్ బాగానే పని చేస్తున్నాయి. చాట్‌జీపీటీ డ్యాష్‌బోర్డ్‌లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్ కొంతసేపటి క్రితం నిలిచిపోయింది. దీనిపై ఆన్లైన్లో ఫిర్యాదులు రావడంతో చాట్‌జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్ఏఐ దీనిపై విచారణ జరుపుతోంది. త్వరలోనే సేవల్ని పునరుద్ధరిస్తామని, ఫీచర్ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. యూజర్లు ఏఐ ఇమేజ్ క్రియేట్ చేస్తుంటే పని చేయడం లేదు. ఇదే సమయంలో టెక్ట్స్ బేస్డ్ కన్వర్జేషన్స్, ఇతర సర్వీసులు బాగానే అందుతున్నాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీలో ఎక్కువ మంది వాడే ఫీచర్లలో ఇమేజ్ జనరేషన్ ఒకటి.
దీని ద్వారా పలువురు ఏఐ ఇమేజ్‌లతోపాటు ఇల్లస్ట్రేషన్స్, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్, ఎడిటెడ్ ఇమేజెస్ వంటివి క్రియేట్ చేసుకుంటారు. ప్రతివారం ఈ ప్లాట్‌ఫామ్‌పై బిలియన్ల కొద్దీ ఇమేజ్‌లు క్రియేట్ అవుతున్నాయి. చాట్‌జీపీటీలో ఈ ఫీచర్ ప్రారంభమైన తొలి వారంలోనే 130 మిలియన్ల యూజర్లు 700 మిలియన్ల ఇమేజ్‌లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఒక వారానికి 1.5 బిలియన్ల ఇమేజ్‌లు క్రియేట్ అవుతున్నాయి. ఇమేజ్ ఎడిటింగ్‌ను కూడా చాట్‌జీపీటీ సులభతరం చేసింది. దీనిలో ఇమేజ్‌లు ఎడిట్ చేయడం కూడా చాలా తేలిక.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

