HYDRAA | నిజమే.. పవన్ కల్యాణ్ భూమి ఎఫ్‌టీఎల్‌లోనే ఉంది..!
HYDRAA : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan)కు సంబంధించిన భూమి ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)లో ఉందని రంగనాథ్ తెలిపారు.
HYDRAA : హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న వేళ హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan)కు సంబంధించిన భూమి ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)లో ఉందని రంగనాథ్ తెలిపారు. జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై స్పందించిన హైడ్రా కమిషనర్అందులో.. పవన్ పేరిట ఉన్న భూమిలో 6, 7 ఎకరాలు చెరువు ప్రాంతంలోనే ఉన్నాయని వెల్లడించారు.
జన్వాడ కోడి చెరువులో తన భూమి ఎఫ్టీఎల్ బయటే ఉందని చెబుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్. తాను చెరువును కజ్జా చేయలేదని, నిరూపిస్తూ తెలంగాణ సీఎంకు అప్పగిస్తానని చెప్పిన పవన్‌కు దిమ్మతిరిగేలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన కొంత భూమి చెరువు పరిధిలోనే ఉందని రంగనాథ్ వెల్లడించారు.
పవన్ ఇక్కడ 2014లో భూమి కొన్నారని.. అయితే అందులో 3, 4 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ బయట ఉన్నాయని రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులో ఫెన్స్ వేయకూడదని.. కానీ, పవన్ కల్యాణ్ చెరువులో ఫెన్స్ వేయడం ఆయన చేసిన తప్పు అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
అవును పవన్ కళ్యాణ్ భూమి FTLలో ఉంది
పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు
పవన్ కళ్యాణ్ భూములు దాదాపు 6, 7 ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయి
మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే FTL బైట ఉన్నాయి… pic.twitter.com/lJBAMbtZmQ
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

