‘సర్’ నోటీసుకు స్పందించకుంటే ఓటు ఔట్… 92.88 లక్షల మందికి నోటీసులు జనరేట్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయవర్గాలు స్పష్టంచేశాయి. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కాకపోతే జాబితా నుంచి ఓటు తొలగించే అవకాశం ఉంటుందని వెల్లడించాయి.
- 85.46 లక్షల మందికి అందజేత
- స్పందించిన ఓటర్లు 38 లక్షల మంది
- డిలీట్ కింద 3,400 మంది గుర్తింపు
- ‘సర్’ పూర్తయ్యాక అందరికీ కొత్త ఎపిక్ కార్డులు అందజేత
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయవర్గాలు స్పష్టంచేశాయి. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కాకపోతే జాబితా నుంచి ఓటు తొలగించే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ కాగా, గురువారం వరకు 85.46 లక్షల మందికి అందజేశారు. వీరిలో సుమారు 38 లక్షల మంది విచారణకు హాజరై తమ వివరాలను సమర్పించారు. మరో 47 లక్షల మంది విచారణకు హాజరుకాలేదని, వారికి మళ్లీ నోటీసులు ఇస్తామని పేర్కొన్నాయి. మరో 7.41 లక్షల మందికి నోటీసులు అందాల్సి ఉన్నది.
వారికి కూడా నోటీసులు అందజేసి, నిర్ణీత ప్రక్రియ ప్రకారం విచారణ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,400 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. సంబంధిత వివరాలు, ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ గుర్తింపు జరిగినట్టు వెల్లడించారు. మార్ఫింగ్ ఫొటోలు పెట్టడం, ఎలాంటి వివరాలు సమర్పించకపోవడం వల్ల అనర్హులుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని ఓటర్లు అందరికీ కొత్త ఎపిక్ కార్డులు జారీ చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ‘సర్’ షెడ్యూల్ ప్రకారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ఓటర్లు, ఇతర వ్యక్తులు క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి విచారణ జరిపి పరిషరించే ప్రక్రియ నవంబర్ ఐదో తేదీ వరకు కొనసాగనున్నది. అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, అనామలిస్ కేసుల పరిశీలన పూర్తయిన అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు.
ఫామ్-6 ద్వారా 4.40 లక్షలు
రాష్ట్రంలో ఫామ్-6 ద్వారా గురువారం వరకు 4.40 లక్షల మంది కొత్త ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నట్టు సీఈవో కార్యాలయవర్గాలు తెలిపాయి. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుదిజాబితాలో 3 కోట్లలోపు ఓటర్లు ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించాయి. ఏఎస్‌డీడీ క్యాటగిరీలో ఓటర్లు, నోటీసులకు స్పందించని, వివరాలు వెల్లడించని ఓటర్లుపోగా అసలైన ఓటర్ల సంఖ్య మూడు కోట్లలోపే ఉంటుందని అభిప్రాయపడ్డాయి.
తెలంగాణ ఓటర్ల వివరాలు
- తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది
- ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇచ్చినవారు 2,64,87,213 మంది
- ఏఎస్‌డీడీ క్యాటగిరీలో ఉన్న ఓటర్లు 73,39,235 మంది
- ‘సర్’ నోటీసులు జనరేట్ అయిన ఓటర్లు 92,87,577 మంది
- ఫామ్స్‌లో అస్పష్టత ఉన్న ఓటర్లు 60,50,918 మంది
- ‘సర్’ -2002 జాబితాతో మ్యాప్కాని ఓటర్లు 32,36,659 మంది
- రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు అందుకున్న ఓటర్లు 85.46 లక్షల మంది
- నోటీసులు అందుకొని హియరింగ్‌కు హాజరైనవారు 38 లక్షల మంది
- నోటీసులు అందుకుని హియరింగ్ హాజరుకానివాళ్లు 47 లక్షల మంది
- ‘సర్’ నోటీసులు ఇంకా అందాల్సిన ఓటర్లు 7.41 లక్షల మంది
- రాష్ట్రవ్యాప్తంగా అనర్హులుగా గుర్తించిన ఓటర్లు 3,400 మంది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

