హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ) : అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలను 28 నుంచి 30 వరకు ఖమ్మంలో నిర్వహించనున్నట్టు ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశీష్ మిట్టల్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిందని వారు విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఈ మేరకు గురువారం సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ‘సర్’, వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందునా నిర్దేశిత గడువులోగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయలేకపోయామని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తునూ నిబంధనల ప్రకారం పరిశీలించి గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.