KTR | స్వరాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు : కేటీఆర్
KTR | స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీలక ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటని ఆయన పేర్కొన్నారు.
KTR : స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీలక ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటని ఆయన పేర్కొన్నారు.
2011 మార్చి 10న మిలియన్ మార్చ్ సందర్భంగా నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారీకేడ్లు, ఇనుపకంచెలు ఇవేవీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. లక్షల గొంతుకలు తెలంగాణ రాష్ట్రం కోసం ట్యాంక్‌బండ్‌పై నినదించిన అద్భుత పోరాట రూపానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు, జై తెలంగాణ అంటూ తన పోస్టును ముగించారు. ఈ పోస్టుకు మిలియన్ మార్చి నాటి కొన్ని ఫొటోలను షేర్ చేశారు. కింది పోస్టులో ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు..
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీలక ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటి.
మార్చి 10, 2011 నాడు నిర్బంధాలు, దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలు… ఇవేవీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి.
లక్షల గొంతుకలు తెలంగాణ రాష్ట్రం కోసం ట్యాంక్‌బండ్‌పై… pic.twitter.com/UOKPUusgPc
— KTR (@KTRBRS) March 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

