వికారాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ సాకుగా చూపి (భూములు అమ్మ డం, కొనడం నిషేధం) భూ దందాకు తెరలేపింది. అప్పొసొప్పొ చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మార్చి డీటీసీపీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం వాటిని నిషేధిత (ప్రొహిబిటెడ్) జాబితాలో చేర్చడంతో జిల్లాలోని పేద, మధ్య తరగతి వారు లబోదిబోమంటున్నారు.
ఈ విషయమై రెవెన్యూ అధికారుల వద్ద ఆరా తీయగా.. వ్యవసాయేతర భూములుగా మార్చి.. ప్లాట్లు, ఇండ్లు నిర్మించుకున్నా వ్యవసాయ భూముల కింద రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉండడంతో ఇక పై వ్యవసాయేతర భూములుగా మారిన లే అవుట్లు, ప్లాట్లు వ్యవసాయ భూముల కింద రిజిస్ట్రేషన్లు కాకుం డా ఆ జాబితాలో పెట్టినట్టు వెల్లడించారు. ఇప్పటికే లేఅవుట్లు, ప్లాట్లుగా మారిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరగొచ్చు, కానీ, 22ఏను సాకుగా చూపుతూ సర్కార్ పెద్ద ఎత్తున భూదందాకు తెర తీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని వ్యవసాయేతర భూములు వ్యవసాయ భూముల కింద రిజిస్ట్రేషన్లు కాకుం డా జిల్లా రెవెన్యూ అధికారులు వాటిని 22ఏ జాబితాలో చేర్చారు.
ఒకే సర్వేనంబర్‌లో నాలా కన్వర్షన్ పూర్తి అయి లే అవుట్లు కావడంతోపాటు వ్యవసాయ భూములు కూడా ఉండడంతో కేవ లం సంబంధిత సర్వేనంబర్ సబ్ డివిజన్ నంబర్లను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చాల్సింది ఉండ గా.. సర్కార్ మొత్తం సర్వేనంబర్‌ను చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే అదునుగా తీసుకొ ని సబ్ రిజిస్ట్రార్లు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గత కొద్ది రోజులుగా జిల్లాలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను ప్రొహిబిటెడ్లో ఉందంటూ చాలావరకు నిలిపివేశారు.
బిడ్డల పెండ్లిళ్లు, అత్యవసరాలకు ప్లాట్లను అమ్మాలనుకునే వారికి మీ భూమి నిషేధిత జాబితాలో ఉందంటూ.. రిజిస్ట్రేషన్ కాదని.. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయాలంటే అడిగినంత ఇవ్వాలంటూ బేరసారాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న ది. 22ఏ జాబితా వ్యవసాయేతర భూములకు సంబంధం లేకున్నా రిజిస్ట్రేషన్లు నిషేధమంటూ బాధితులను భయపెడుతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నా రు. కేవలం ఒక సబ్ డివిజన్ నంబర్ వ్యవసాయ భూమిగా ఉండడం, మిగతా భూమంతా వ్యవసాయేతర భూమిగా మారినా మొత్తం ప్రొహిబిటెడ్ జాబితాలో ఉందని చెబుతూ రిజిస్ట్రేషన్లు చేసేందుకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రచారం ఉన్నది.

అనుమతులిస్తూ.. నిషేధిత జాబితాలో చేర్చుతారా?
డీటీసీపీ అనుమతులిచ్చి మళ్లీ క్రయవిక్రయాలు జరుగకుండా నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీటీసీపీ అన్ని కరెక్ట్‌గా ఉంటేనే ఇస్తారు. డీటీసీపీ అనుమతులిచ్చిన తర్వాతే వెంచర్లు చేస్తారు. వెంచర్లు చేసిన తర్వాత నిషేధిత జాబితాలో చేర్చడంలో ఏమైనా అర్థమున్నదా? అని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పలు లే అవుట్లు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చడంపై బాధితులతో కలిసి సోమవారం ఆయన కలెక్టర్ దీపక్తివారీకి వినతిపత్రాన్ని అందజేశా రు.
అనంతరం మాట్లాడుతూ..ఒకవైపు అనుమతిలి స్తూ..మరోవైపు నిషేధిత జాబితాలో ఉన్నది అమ్మొద్దు, కొన్నద్దని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పదెకరాల భూమిలో రెండెకరాలు ప్రొహిబిటెడ్లో ఉంటే మిగిలిన భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లను చేయడం లేదని మండిపడ్డారు. తగిన ఆధారాలు చూపిస్తే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్తున్నా గతంలో కొద్ది రోజులు చేసి ప్రస్తుతం నిలిపివేశారని బాధితులు పేర్కొంటున్నారన్నారు. ఎందు కు ప్రొహిబిటెడ్లో పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా డీటీసీపీ లేఅవుట్పై కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఆర్ఐ సంతకాలు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో 1983లో లేఅవుట్ అయిన ఎన్జీవోకాలనీ 43 ఏండ్ల తర్వాత ప్రొహిబిటెడ్లో పడిందని, కమలానగర్, సాకత్నగర్లలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. కానీ, ఎవరి ఇల్లు నిషేధి త జాబితాలో ఉన్నదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అత్యవసరాలకు రుణాల కోసం బ్యాంకుకెళ్తే మీ ప్లాటు ప్రొహిబిటెడ్లో ఉందని, రుణం మం జూరు చేయలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నట్టు బాధితులు పేర్కొం టున్నారని ఆనంద్ అన్నారు. స్పందించిన కలెక్టర్ దీపక్‌తివారీ తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రజాసమస్యలపై స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు పట్టింలేదని మండిపడ్డారు. లేఅవుట్లు, ప్లాట్లు ప్రొహిబిటెడ్లో చేర్చడంపై రివ్యూ చేయాలన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది సమస్యలను తీరుస్తారని కానీ పట్నంలో కూర్చుంటారని కాదన్నారు.