న్యూయార్క్: యూఎస్ ఓపెన్(US Open) టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో.. అమెరికన్ స్టార్ ప్లేయర్ బెన్ షెల్టన్.. టాప్ సీడ్ అలెగ్జాండ్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. ఇవాళ జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో అమెరికన్ ప్లేయర్, 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫోపై 4-6, 6-3, 6-3, 7-5 స్కోరుతో 8వ సీడ్ బెన్ షెల్టన్ విజయం సాధించాడు. తొలి సెట్లో ఓటమి చెందిన తర్వాత.. బెన్ షెల్టన్ అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన ఎనర్జీతో ఉన్న షెల్టన్ సెమీస్‌లోనూ ఆ దూకుడును ప్రదర్శించాడు.
ఇవాళ ఉదయం జరిగిన ఫస్ట్ సెమీస్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 7-6 (7), 7-6 (6) స్కోరుతో కారెన్ ఖాచానోవ్పై గెలుపొందాడు. షెల్టన్-టియాఫో మ్యాచ్‌ను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. సెరీనా విలియమ్స్ లాంటి టెన్నిస్ దిగ్గజాలు, ఇతర సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. 2003 నుంచి ఇప్పటి వరకు అమెరికన్ ప్లేయర్‌కు యూఎస్ ఓపెన్ టైటిల్ దక్కలేదు. అయితే ఈసారైనా ఆ అవకాశం వస్తుందా అన్న ఆలోచనల్లో అమెరికన్లు ఉన్నారు. జ్వెరెవ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
Shelton 🆚 Zverev
Sunday in New York. pic.twitter.com/vGaBKJw1EK
— US Open Tennis (@usopen) September 12, 2026