గాంగ్జూ: బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీ, గాంగ్జూ మధ్య రెగ్యులర్ ప్యాసింజెర్ విమానాల(China Flights)ను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆ ప్రయాణాలు మొదలు కానున్నట్లు చైనా సదర్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ చైనా సదరన్ సర్వీసులను ఇండియాలో ప్రారంభించనున్నారు.
ఢిల్లీలోని భారత మండపంలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 15వేల మంది పోలీసుల్ని, 200 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. ఏప్రిల్లో భారత్, చైనా మధ్య ఎయిర్ చైనా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. బీజింగ్- ఢిల్లీ మధ్య ఆ సర్వీసులు నడుస్తున్నాయి. చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ సంస్థ ఏప్రిల్ 18వ తేదీ నుంచి కునిమింగ్, కోల్కతా మధ్య సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే.