గాయం కారణంగా రెస్ట్ మోడ్లో ఉన్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ త్వరలోనే మళ్లీ యాక్షన్లోకి దిగనున్నారు. ప్రస్తుతం ఆయన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ‘NBK 111’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయింది. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్లోకి బాలయ్య ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలావుంటే.. కొరటాల శివ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ తొలివారం నుంచి మొదలుకానున్నది.
ఇందులో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. ద్విపాత్రాభినయం బాలకృష్ణకు కొత్తేం కాదు. ఇప్పుడున్న హీరోల్లో అత్యధికంగా డ్యుయెల్ రోల్స్ చేసింది బాలకృష్ణే. మళ్లీ ఈ సినిమాలో ఆయన ఇద్దరుగా కనిపించనున్నట్టు తెలుస్తున్నది. పైగా ఈ రెండు పాత్రలూ భిన్న ధృవాల్లా ఉంటాయట. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని చెరుకూరి సుధాకర్ నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘కార్పెంటర్’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది.