Viral Video | డ్యూటీ వదిలేసి ఐటెం సాంగ్స్‌పై స్టెప్పులు.. నర్సులపై వెల్లువెత్తున విమర్శలు
Viral Video | ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో, పేషెంట్లను గాలికొదిలేసి ఇద్దరు నర్సులు ఐటెం సాంగ్‌లపై డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
Viral Video | ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో, పేషెంట్లను గాలికొదిలేసి ఇద్దరు నర్సులు ఐటెం సాంగ్‌లపై డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో స్పందించిన అధికార యంత్రాంగం ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు వేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కరోజు ముందే వేడుకలు చేసుకున్నారు. సెమినార్ హాలులో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు నర్సింగ్ సిబ్బంది సినిమాల్లో ఐటెం సాంగ్‌లకు డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నర్సులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విధి నిర్వహణ సమంయలో రోగులను నిర్లక్ష్యం చేసి, డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వీడియో ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యాన్స్ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్‌లు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో డ్యాన్స్‌లు చేసిన ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు
మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రి సెమినార్ హాల్లో కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటెం సాంగ్‌కు డ్యాన్స్… pic.twitter.com/A96n0HuRQL
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

