Strait Of Hormuz | ఇరాన్‌తో చేతులు కలిపితే ఒమన్‌పై బాంబు దాడి చేస్తాం.. హార్ముజ్ తెరిచే యత్నాలపై ట్రంప్ వార్నింగ్
Strait Of Hormuz : మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ఇరాన్‌తో ఒమన్ చేతులు కలిపితే ఒమన్‌పై కూడా బాంబు దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో ఒమన్ దూరంగా ఉండాలని సూచించారు. గ
Strait Of Hormuz : మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ఇరాన్‌తో ఒమన్ చేతులు కలిపితే ఒమన్‌పై కూడా బాంబు దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో ఒమన్ దూరంగా ఉండాలని సూచించారు. గల్ఫ్ సంక్షోభం కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఆ దేశం మూసేసింది. దీంతో ఒమన్ సహా పలు గల్ఫ్ దేశాలకు చెందిన చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో ఒమన్ సహా అనేక గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఇక, అమెరికా కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భందించింది. ఈ నేపథ్యంలో ఒమన్‌కు తీవ్ర నష్టం వస్తుండటంతో తన వైఖరిలో మార్పు వచ్చింది. అమెరికాతో కలిసి ఉండటం కంటే ఈ విషయంలో ఇరాన్‌తో సంధి చేసుకోవడం బెటర్ అని భావిస్తోంది. ఇందుకోసం ఇరాన్‌తో కలిసి హార్ముజ్ జలసంధిని తెరిచే అంశాన్ని పరిశీలిస్తోంది. జలసంధికి సంబంధించి ఒమన్ తీరం నుంచి ఎంట్రీ, హార్ముజ్ నుంచి ఎగ్జిట్ వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. రెండు దేశాలు కలిసి ఇక్కడి నౌకా మార్గాన్ని నియంత్రించాలని చూస్తున్నాయి. అంటే, అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా ఇరాన్, ఒమన్ కలిసి.. హార్ముజ్ జలసంధిని నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఈ విషయం ఇంకా చర్చలు, ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ అంశమే ఇప్పుడు ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది.
హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్‌తో ఒమన్ ఒప్పందం కుదుర్చుకుంటే ఒమన్‌పై బాంబు దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్, హార్ముజ్ విషయంలో తాము చేస్తున్న ప్రయత్నాలకు ఒమన్ అడ్డు తగలకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీని ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక, రహస్య ఛానెల్ ఏర్పాటు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అలాగే, యుద్ధాన్ని త్వరగా ముగించాలనే ఆలోచన ఏదీ తమకు లేదని కూడా ట్రంప్ తేల్చిచెప్పాడు. ఇంతకాలం ఒమన్.. అమెరికాకు సహకరించింది. అయితే, ఇరాన్ యుద్దం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లడంతో అమెరికాతో ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తోంది. దీనికి బదులు నేరుగా ఇరాన్‌తోనే ఒప్పందం చేసుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగా ఒమన్, ఇరాన్ చర్చలు జరుపుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

