‘తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్’ పథకానికి సింగరేణి అండ
- రూ.61.44 కోట్ల సీఎస్ఆర్ సహకారం
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్ పథకానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా సింగరేణి సంస్థ రూ.61.44కోట్ల సహకారం అందించింది.
ఈ నిధులతో 9చోట్ల సెంట్రలైజ్డ్ వంటశాల ఏర్పాటుకు చేయూతనిచ్చి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 4లక్షలకుపైగా విద్యార్థులకు నిత్యం పౌష్టిక అల్పాహారం అందించనున్నారు. తొలిదశలో కొండగల్‌లో సెంట్రలైజ్డ్ వంటశాలకు రూ.2కోట్లను మంజూరు చేసింది. తర్వాతి దశలో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నది. వీటికి సింగరేణి సంస్థ రూ.21.3కోట్లను మంజూరు చేసింది. సింగరేణి, కొత్తగూడెం, భూపాలపల్లి, కాగజ్‌నగర్, మునగాల(సూర్యాపేట) ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్లకు రూ.38.41కోట్లను కేటాయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

