Leader Teaser | యాక్షన్ థ్రిల్లర్‌గా ‘లీడర్’… లెజండ్ శరవణన్ మూవీ టీజర్‌కు మంచి స్పందన
Leader Teaser | ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా పరిచయమైన చిత్రం ది లెజెండ్. ఆ సినిమాతో ఆయన “లెజెండ్ శరవణన్”గా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ లీడర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Leader Teaser | ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా పరిచయమైన చిత్రం ది లెజెండ్. ఆ సినిమాతో ఆయన “లెజెండ్ శరవణన్”గా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ లీడర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పేరుకు ‘లీడర్’ అయినప్పటికీ ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కాదు. తండ్రీ–కూతుళ్ల మధ్య ఉన్న బలమైన అనుబంధం, భావోద్వేగం ఈ సినిమా ప్రధానాంశంగా కనిపిస్తోంది.
టీజర్ ప్రారంభంలోనే హీరో తన కూతురి కోసం ఎంతవరకైనా పోరాడతాననే భావాన్ని వ్యక్తం చేస్తాడు. “నా కూతురుతో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తా” అనే డైలాగ్‌తో మొదలైన టీజర్, తరువాత పూర్తి యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. తన కూతురికి ఎదురైన సమస్యల కారణంగా ఓ తండ్రి పడే ఆవేదన, కుటుంబాన్ని కాపాడేందుకు అతడు చేసే పోరాటం, ఆ క్రమంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వంటి అంశాలను టీజర్లో చూపించారు. జైలులో ఉన్నప్పటికీ కూతురి జ్ఞాపకాలతో బాధపడే తండ్రి పాత్ర కథలో భావోద్వేగాన్ని పెంచుతోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుగా ‘లీడర్’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయబోతుందని టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా లెజెండ్ శరవణన్ నటిస్తుండగా, హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ కనిపించనున్నారు. ముఖ్యపాత్రల్లో శ్యామ్ , ఆండ్రియా జెరెమియా, సంతోష్ ప్రతాప్, లాల్ , ప్రభాకర్ (బాహుబలి ప్రభాకర్), అమృత అయ్యర్, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంగీతాన్ని జిబ్రాన్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ఎస్. వెంకటేష్ నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఈ. రాఘవ్ చేపట్టారు. యాక్షన్ సన్నివేశాలకు మహేశ్ మాథ్యూ స్టంట్స్ అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

