భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో నేరాలు పెరుగుతున్నాయి. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆమెకు నిప్పంటించి పారిపోయారు. (Girl set on fire) తీవ్ర కాలిన గాయాలైన బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బయాబర్ గ్రామానికి చెందిన 12వ తరగతి చదువుతున్న బాలిక బుక్స్ తిరిగి ఇచ్చేందుకు శనివారం ఉదయం 8.30 గంటలకు స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నది. భార్గవి నది సమీపంలోని నిర్జన ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆ అమ్మాయిని కట్టేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, మంటల్లో కాలుతూ అరుస్తున్న బాలికను స్థానికులు చూశారు. వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారు. తొలుత పిపిలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆ అమ్మాయిని తరలించారు. తీవ్ర కాలిన గాయాలైన ఆమెను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వ్యక్తిగత శత్రుత్వం లేదా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ప్రతీకారం వంటి కారణాలను బాధిత బాలిక కుటుంబం తోసిపుచ్చిందని చెప్పారు.
Also Read:
Professor Abuses Student | ఒడిశాలో మరో విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్
Watch: ఒడిశాలో మరో అమానుషం.. మరో జంటను నాగలికి కట్టి దున్నించిన వైనం
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?