భువనేశ్వర్: ఒడిశాలో మరో విద్యార్థిని ప్రొఫెసర్ లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Professor Abuses Student) హెచ్‌వోడీ లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత తాజాగా ఇది బయటపడింది. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. గంగాధర్ మెహర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గోపీచంద్ సునా ఒక విద్యార్థిని లైంగికంగా వేధించాడు. ప్రభుత్వ క్వార్టర్స్‌కు ఆమెను రప్పించి వేధింపులకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులను ధృవీకరించిన తర్వాత ప్రొఫెసర్ గోపీచంద్ సునాను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ చదువుతున్న విద్యార్థిని హెచ్‌వోడి లైంగికంగా వేధించాడు. తన కోరిక తీర్చకపోతే ఆమె భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. ఆ లెక్చరర్ వేధింపులు భరించలేని ఆ విద్యార్థిని సోమవారం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కలకలం రేపిన ఈ సంఘటనపై ఒడిశాలో నిరసనలు వెల్లువెత్తాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
Also Read:
Uddhav meets Fadnavis | ప్రభుత్వంలో కలవాలన్న ఆహ్వానం తర్వాత.. ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?