ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం కలిశారు. (Uddhav meets Fadnavis) కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే పాలకపక్షంలోకి మారాలని అసెంబ్లీ వేదికగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆహ్వానించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. శాసన మండలి చైర్పర్సన్ రామ్ షిండే గదిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి నియామకం, వివాదాస్పద త్రిభాషా విధానం వంటి అంశాలపై చర్చించారు.
కాగా, మహారాష్ట్రకు చెందిన వివిధ సంపాదకులు రాసిన వ్యాసాల సంకలనం ‘మనకు హిందీ ఎందుకు అవసరం?’ అనే పుస్తకాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉద్ధవ్ ఠాక్రే అందజేశారు. త్రిభాషా విధాన నిర్ణయాన్ని సమీక్షించే కమిటీకి నేతృత్వం వహిస్తున్న నరేంద్ర జాదవ్‌కు కూడా ఆ కాపీ ఇవ్వాలని ఆయన కోరారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా ఆయన వెంట ఉన్నారు. 1వ తరగతి నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది జర్నలిస్టులు, సంపాదకులు రాసిన వ్యాసాల సంకలనాన్ని సీఎం ఫడ్నవీస్‌కు అందజేసినట్లు ఆదిత్య ఠాక్రే తెలిపారు.
Also Read:
Cop Beats Up Farmer | ఎరువుల కోసం రైతు డిమాండ్.. కర్రలతో కొట్టిన పోలీసులు, అతడి తల్లిపైనా దాడి
Watch: రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించేందుకు ప్రయత్నించిన బైకర్.. తర్వాత ఏం జరిగిందంటే?