లక్నో: ఎరువుల కోసం డిమాండ్ చేసిన రైతుపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. కర్రలతో అతడ్ని కొట్టారు. (Cop Beats Up Farmer) ఆ రైతు తల్లిపై కూడా పోలీసులు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఈ జిల్లాకు చెందిన చిన్న రైతులు ప్రభుత్వ ఎరువుల షాపుల వద్ద బారులు తీరారు. తమకు యూరియా అందలేదని వాపోయారు. ధనిక రైతులకు ఎరువులతో నిండిన లారీలు పంపుతున్నారని ఆరోపించారు. రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు.
కాగా, ఎరువుల కోసం డిమాండ్ చేసిన ఒక రైతుపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. కర్రలతో అతడ్ని కొట్టారు. ఆ రైతు తల్లిపై కూడా పోలీసులు దాడి చేశారు. వారిద్దరిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఇది చూసిన స్థానికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైతును కర్రలతో కొట్టిన పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
थाना फरधान की पुलिस
ये जिन पर लाठियां बरसाई जा रही है इनकी गलती ये है की ये किसान है और अपनी फसल के लिए इनको खाद चाहिए थी।इसीलिए लखीमपुर मोहम्मदी हाईवे किया था जाम कृषि मंत्री जिले में ही थे और किसानों के साथ ये हो रहा है। @PMOIndia @myogioffice @DmKheri @kheripolice @Uppolice pic.twitter.com/pdwcUGi2jW— shaban Siddiqui (@siddiqiu_shaban) July 17, 2025
Also Read:
Woman Strangles Daughter | ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ.. కుమార్తెను చంపి భర్తపై నింద
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?