Dale Steyn | నిజాయతీగా చెబుతున్నా.. అసలైన చోకర్స్ న్యూజిలాండ్ జట్టే..!
Dale Steyn : ప్రపంచకప్ వంటి టోర్నీల్లో నాకౌట్ దశలోనే ఇంటిదారి పట్టే సఫారీ టీమ్‌ను చోకర్స్ అనడం మామూలైపోయింది. కానీ, మాజీ పేసర్ డేల్ స్టెయిన్(Dale Steyn) మాత్రం తమ జట్టును చోకర్స్‌గా పిలవడాన్ని ఖండించాడు.
Dale Steyn : పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో అనూహ్య తడబాటుతో దక్షిణాఫ్రికా(South Africca) మరోసారి తాము చోకర్స్ (Chokers) అనిపించుకుంది. ఐసీనీ ఈవెంట్లలో లీగ్ దశను గొప్పగా ఆడడం.. తీరా నాకౌట్స్‌లో చేతులెత్తేయడం ఆ జట్టుకు పరిపాటిగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సఫారీ టీమ్‌ను అందరూ చోకర్స్ అనడం మామూలైపోయింది. కానీ, మాజీ పేసర్ డేల్ స్టెయిన్(Dale Steyn) మాత్రం తమ జట్టును చోకర్స్‌గా పిలవడాన్ని ఖండించాడు. మేము కాదు.. అసలైన చోకర్స్ న్యూజిలాండే అని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ క్రికెట్లో చోకర్స్ అనే ట్యాగ్ దక్షిణాఫ్రికాకు నూటికి నూరు శాతం సరిపోతుంది. ప్రతిసారి ఐసీసీ ఈవెంట్లలో సెమీస్ వరకూ వెళ్లడం.. ఫైనల్ చేరినా విజేత అనిపించుకోకుండానే ఇంటిదారి పట్టడం సఫారీలకు ఒక అలవాటుగా మారింది. రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో గెలిచే మ్యాచ్‌ను వదిలేసింది ప్రొటీస్ జట్టు. ఈసారి కప్‌ను పట్టేద్దామని మర్క్రమ్ సేన లీగ్ దశ నుంచి సూపర్ 8 వరకూ అజేయంగా నిలిచింది. కానీ, సెమీస్‌లో న్యూజిలాండ్‌ను నిలువరించలేక ఉసూరుమంటూ నిష్క్రమించింది.
Dale Steyn on South Africa’s chokers tag 🗣️ pic.twitter.com/gjAzj4cQQn
— ESPNcricinfo (@ESPNcricinfo) March 7, 2026
పట్టుదలకు కొదవ లేకున్నా.. అదృష్ట దేవత అనుగ్రహానికి నోచుకోని సఫారీలకు మళ్లీ చోకర్స్ ట్యాగ్‌ను ఆ జట్టుకు ఆపాదిస్తున్నారంతా. ఈ నేపథ్యంలో ఆ దేశ దిగ్గజం డేల్ స్టెయిన్ మాత్రం.. అసలైన చోకర్స్ న్యూజిలాండ్ జట్టే అని ఘంటాపథంగా చెబుతున్నాడు.

‘చోకర్స్ అనే విషయంలో మనం నిజాయతీగా ఉందాం. ప్రతి ఒక్కరూ దక్షిణాఫ్రికాను చోకర్స్ అంటున్నారు. కానీ, న్యూజిలాండ్ సైతం ఎక్కువ వరల్డ్‌కప్ ట్రోఫీలు గెలవలేదు. చెప్పాలంటే మా జట్టు కంటే అత్యధిక ఫైనల్స్ ఆడింది కివీస్. ఆ లెక్కన చూస్తే ఆ జట్టు మా కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచి ఉండాలి. ఈ విషయంలో న్యూజిలాండ్ నేరమేమీ లేదు. వాళ్లు కచ్చితంగా పొట్టి ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఆదివారం ఫైనల్లో భారత్ చేతిలో బ్లాక్ క్యాప్స్ ఓడితే మాత్రం అసలైన చోకర్స్ వాళ్లే అవుతారు’ అని స్టెయిన్ అన్నాడు.
21 ఏళ్లకు..
అవును.. స్టెయిల్ అన్నదాంట్లో వాస్తవం లేకపోలేదు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. కానీ, కేవలం రెండుసార్లు మాత్రమే ఆ జట్టు విజేతగా నిలిచింది. 2000 సంవత్సరంలో ఐసీసీ నాకౌట్ ట్రోఫీని పట్టేసిన కివీస్.. 21 ఏళ్లకు.. కేన్ విలియమ్సన్ సారథ్యంలో 2021లో టెస్టు ఛాంపియన్షిప్(WTC) గెలుపొందింది.

అంతే.. ఆ తర్వాత నుంచీ ఆ జట్టును ఓటమే పలకరిస్తోంది. 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత జట్టు ధాటికి బ్లాక్ క్లాప్స్ తోకముడించింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన కివీస్‌ను మిచెల్ శాంట్నర్ విజేతగా నిలుపుతాడా? లేదా? అనేది ఆ జట్టుకు చోకర్స్ ట్యాగ్‌ను నిర్ణయించనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

