లక్నో: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నది. భర్తతో జరిగిన గొడవ నేపథ్యంలో ఐదేళ్ల కుమార్తె గొంతునొక్కి హత్య చేసింది. (Woman Strangles Daughter) తన కూతుర్ని భర్త చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళే తన కుమార్తెను హత్య చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రోష్ణి ఖాన్, షారుఖ్ ఖాన్ భార్యాభర్తలు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉన్నది.
కాగా, భర్తతో గొడవపడిన రోష్ణి తన కుమార్తెతోపాటు ప్రియుడు ఉదిత్ జైస్వాల్‌తో కలిసి నివసిస్తున్నది. జూలై 14న రాత్రి వేళ ప్రియుడు ఇంట్లో లేని సమయంలో భర్త షారుఖ్ అక్కడకు వెళ్లాడు. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భర్తను పోలీస్ కేసులో ఇరికించాలని భార్య భావించింది. అతడు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత తనతో ఉంటున్న ఐదేళ్ల కుమార్తెను గొంతునొక్కి చంపింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసింది. తన కూతుర్ని భర్త హత్య చేసినట్లు ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారిని గొంతునొక్కి చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆ బాలిక తల్లి రోష్ణి అబద్ధం చెప్పినట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, ప్రియుడితో సంబంధం నేపథ్యంలో భర్తను కేసులో ఇరికించేందుకు తన కూతుర్ని హత్య చేసినట్లు రోష్ణి ఖాన్ చెప్పింది. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: