తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త ఎంతో బాధాకరమని దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ నాయకుడు నాగరాజు గుర్రాల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సరళత, ఉద్యమస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.
హుజూరాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ తరఫున కొందరు సభ్యులకు పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం లభించిందని నాగరాజు గుర్రాల గుర్తు చేశారు. ముఖ్యంగా శాఖ సభ్యులు శివారెడ్డి, ఉపేందర్ రెడ్డిలు కొద్ది రోజుల పాటు ఆయనతో కలిసి పనిచేసి, ఆయన నాయకత్వాన్ని, కార్యకర్తల పట్ల ఉన్న ఆప్యాయతను దగ్గర నుంచి చూసే అవకాశం దక్కిందని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాలకు, బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ తరఫున నాగరాజు గుర్రాల ప్రార్థించారు.