Jamuna Rani | ప్రముఖ నేపథ్య గాయని జమునారాణి కన్నుమూత.. భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు
Jamuna Rani | దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని కోక జమునారాణి కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.
Jamuna Rani | దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని కోక జమునారాణి కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1938లో ఆంధ్రప్రదేశ్లో జన్మించిన జమునారాణి చిన్న వయసులోనే సంగీతంపై అసాధారణ ప్రతిభ కనబరిచారు. కేవలం ఏడేళ్ల వయసులోనే గాయనిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, 1946లో విడుదలైన క్లాసిక్ చిత్రం ‘త్యాగయ్య’ ద్వారా బాలనటిగా, నేపథ్య గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
తన సుదీర్ఘ కెరీర్లో జమునారాణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో కలిపి 6 వేలకుపైగా పాటలు ఆలపించారు. 1940ల నుంచి 1980ల వరకు అనేక మంది అగ్ర హీరోలు, ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేస్తూ తన గాత్రంతో ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించారు. ఆమె కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటల్లో ‘దేవదాసు’ చిత్రంలోని “ఓ దేవత”, “చెలియ లేదుష, అభిమానం లోని పద పదవే వయారి గాలిపటమా, మంచి మనసులు లోని మామ మామ మామ ఏమే ఏమే భామ , రాముడు భీముడు లోని సరదా సరదా సిగరెట్టు, లవకుశ లోని విరిసే చల్లని వెన్నెల , బంగారు తిమ్మరాజు లోని నాగమల్లి కోనలోన నక్కింది లేడి కున వంటి ఎన్నో సూపర్ హిట్ గీతాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
అలాగే ‘ద్రోహి’, ‘రత్నమాల’, ‘లైలా మజ్ను’, ‘చంద్రమతి’, ‘దేవదాసు’, ‘సంతానం’, ‘అలీబాబా 40 దొంగలు’, ‘వద్దంటే పెళ్లి’, ‘బడిపంతులు’, ‘అన్నా తమ్ముడు’, ‘బంగారు తిమ్మరాజు’ వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె ఆలపించిన పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. 1987లో విడుదలైన దర్శకుడు మణిరత్నం క్లాసిక్ చిత్రం నాయకుడు లో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆమె ఆలపించిన “నా నవ్వే దీపావళి” పాట కూడా ఆమె గొప్ప గాత్ర ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. తెలుగు సినీ సంగీతానికి మాత్రమే కాకుండా దక్షిణ భారత సంగీత సంపదకు తన గాత్రంతో అపూర్వ సేవలందించిన జమునారాణి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పాడిన వేలాది పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, ఆమెను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

