Sardar 2 | ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్.. కొత్త అప్డేట్తో సర్ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్
Sardar 2 | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మిస్కిన్ రూపొందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా‘సర్దార్ 2’ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
Sardar 2 | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మిస్కిన్ రూపొందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా‘సర్దార్ 2’ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్ల క్రితమే చిత్ర బృందం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు ఆ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మేకర్స్ ఈరోజు ప్రత్యేక అప్డేట్ రానుందని ప్రకటించినప్పటికీ, పోస్టర్లో విడుదల తేదీని ప్రస్తావించలేదు. దీంతో సినిమా విడుదల వాయిదా పడుతోందా? కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘సర్దార్ 2’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, సినిమా ముందుగా ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడం కేవలం కొత్త అప్డేట్పై ఆసక్తిని పెంచేందుకేనని సమాచారం.మేకర్స్ విడుదల చేయబోయే ఈ తాజా అప్డేట్ ఏమిటన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. కొత్త టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్, గ్లింప్స్ లేదా మరో కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’ ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తొలి భాగం సాధించిన విజయాన్ని మించి ఈ సీక్వెల్ ఉండేలా యాక్షన్, స్పై ఎలిమెంట్స్, విజువల్స్‌ను మరింత గ్రాండ్‌గా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే కార్తీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. మరికొన్ని గంటల్లో రానున్న అధికారిక అప్డేట్తో ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

