Seema Kaliramna: మహిళల డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా
Seema Kaliramna : భారతీయ మహిళా అథ్లెట్ సీమా కాలీరమణ.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలుచుకున్నది. మహిళల డిస్కస్ త్రోలో ఆమెకు కాంస్యం దక్కింది. తన మూడవ ప్రయత్నంలో ఆమె డిస్కస్‌ను 58.65 మీటర్ల దూరం విసిరింది. మరో భారత ప్లేయర్ నిధి రాణి ఆ ఈవెంట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నది.
గ్లాస్గో: భారతీయ మహిళా అథ్లెట్ సీమా కాలీరమణ(Seema Kaliramna).. కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలుచుకున్నది. మహిళల డిస్కస్ త్రోలో ఆమెకు కాంస్యం దక్కింది. ఆమె తన మూడవ ప్రయత్నంలో డిస్కస్‌ను 58.65 మీటర్ల దూరం విసిరింది. మరో భారత ప్లేయర్ నిధి రాణి ఆ ఈవెంట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నది. సీమా తన నాలుగవ, అయిదో, ఆరవ ప్రయత్నాల్లో ఫౌల్ చేసింది. కానీ మూడో రౌండ్లో ఆమె ప్రదర్శన కీలకంగా నిలిచింది. ఆ త్రో వల్లే ఆమెకు బ్రాంజ్ మెడల్ దక్కింది. జమైకాకు చెందిన సమంతా హాల్ ఈ ఈవెంట్లో స్వర్ణ పతకం దక్కించుకున్నది. ఆమె 61.66 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరేసింది. కెనడాకు చెందిన జూలియా టంక్స్ 60.67 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇటీవలే బీబీకి జన్మనిచ్చిన సీమా.. మళ్లీ డిస్కస్‌లో రాణిస్తున్నది. 2025 నేషనల్ గేమ్స్‌లో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆమె ప్రస్తుతం పీహెచ్డీ చదువుతున్నది.
Congratulations to Seema Kaliramna upon clinching the Bronze Medal in Women’s Discus Throw, with a best effort of 58.65m, at the Commonwealth Games 2026. Her fantastic win is a testament to her courage, determination and resilience.
Wishing her all the best for her future… pic.twitter.com/JgTsy4yLmM
— Rajnath Singh (@rajnathsingh) July 31, 2026
కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల సంఖ్య 17కు చేరుకున్నది. దీంట్లో మూడు స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 8 రోజుల క్రీడలు ముగిశాయి. తాజా మెడల్స్ ప్రకారం ఇండియా పదవ స్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియా అత్యధికంగా 110 మెడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

