తుంగతుర్తి, మార్చి 07 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో శనివారం సర్కిల్ పరిధిలోని సారాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలకు డీటీఎఫ్ ఎక్సైజ్ సీఐ స్టీఫెన్ సన్, సీఐ రజిత ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రజిత మాట్లాడుతూ 15 వాహనాలకు, ఒక డీసీఎంకు వేలం పాట నిర్వహించామని పాటదారులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నట్లుత తెలిపారు. మొత్తం వాహనాలకు రూ.3 లక్షల 41 వేల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.