Harish Rao | కర్ణుడు మాట మీద నిలబడ్తడు.. గుండెల మీద తన్నినోడు రేవంత్ రెడ్డి : హరీష్ రావు
Harish Rao | మహాభారతంలో కర్ణుడి లాగా నేను కూడా నా స్నేహితులకు సహాయం చేస్తాను.. అది కొంత మందికి నచ్చవచ్చు, కొంత మందికి నచ్చక పోవచ్చు అని ఓ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై హరీష్ రావు తనదైన స్టైల్లో చురకలంటించారు.
Harish Rao | ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు కూల్చేసినప్పుడు బాధితులు గుండెలవిసేలా రోదిస్తే, అక్కడికి బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కూడా కంటతడి పెట్టారని అన్నారు.
మహాభారతంలో కర్ణుడి లాగా నేను కూడా నా స్నేహితులకు సహాయం చేస్తాను.. అది కొంత మందికి నచ్చవచ్చు, కొంత మందికి నచ్చక పోవచ్చు అని ఓ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై హరీష్ రావు తనదైన స్టైల్లో చురకలంటించారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా.. క్రూరుడు. ఖమ్మంలో బాధితులు ఏడుస్తూంటే పాపం ఎస్ఐ కండ్లళ్ల నీళ్లు పెట్టుకున్నడు. అక్కడికి పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతుంటే గుండెలవిసి పోయేలా అక్కాచెల్లెళ్లు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కండ్లలో కూడా నీళ్లు ఆగలేదు.
రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది.. ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డరు. ఆ ఎస్ఐకి కండ్లళ్ల నీళ్లొచ్చినయ్.. ఆ వీడియోలు చూసి మనందరం కూడా బాధపడ్డం కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి.. నువ్వు కర్ణుడివి కాదు.. క్రూరుడివి..కర్ణుడికి నీకు పోలికే లేదు. కర్ణుడు మాట మీద నిలబడ్తడు. గుండెలను చీల్చి కవచ కుండలాలను ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే.. గుండెల మీద తన్నినోడు ఈ రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు క్రూరుడు
ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసినప్పుడు బాధితులు గుండెలవిసేలా రోదిస్తే, అక్కడికి బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కూడా కంటతడి పెట్టారు
ఖమ్మం బాధితుల వీడియోలు చూసి రాష్ట్రమంతా బాధపడ్డది కానీ వీసమెత్తు బాధ పడని క్రూరుడు రేవంత్ రెడ్డి
గుండెలు… https://t.co/2PV69anYJV pic.twitter.com/rzlQCjdP2R
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026
Read Also :
ATM theft | అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ.. 1.60 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Hyderabad | రెండో పెళ్లి చేసుకున్న హోంగార్డు.. విషయం బయటపడటంతో రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌కు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

