రాయ్‌పూర్: రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు ఒక బైకర్ ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పిన స్కూటీ డ్రైనేజీ వైపు దూసుకెళ్లింది. అందులో పడిన యువకుడు మరణించాడు. (Teen Biker Dies To Save Stray Dog) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 14న సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భిలాయ్‌లోని సుపెలా ప్రాంతంలో 16 ఏళ్ల రౌనక్ తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తున్నాడు. రోడ్డు మధ్యలో వీధి కుక్క ఉండటాన్ని అతడు గమనించాడు. దానిని ఢీకొట్టకుండా స్కూటీని తప్పించేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఆ కుక్క ఉన్నట్టుండి పక్కకు వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన అది రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ వైపు దూసుకెళ్లింది. స్కూటీపై ఉన్న రౌనక్ ఆ డ్రైనేజీలో పడిపోయాడు. రోడ్డు పక్కన పడిన అతడి స్నేహితుడు గాయపడ్డాడు.
మరోవైపు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఇది చూసి వెంటనే అక్కడకు వెళ్లారు. ఇంతలో మరికొందరు అక్కడ గుమిగూడారు. డ్రైనేజీలో పడిన రౌనక్‌ను వారు బయటకు తీశారు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आवारा आतंक — #छत्तीसगढ़ के भिलाई में आवारा कुत्ते ने पहले एक बाइक वाले पर हमला किया, सौभाग्य से वो बच गया. लेकिन कुछ ही सेकेंड के बाद उसी कुत्ते ने एक स्कूटी सवार पर हमला कर दिया जिससे स्कूटी अनियंत्रित होकर गिर गई. स्कूटी सवार 17 वर्षीय रौनक द्विवेदी की मौके पर ही मौत हो गई. pic.twitter.com/aW1x9mqs7A
— Deepak Singh (@SinghDeepakUP) July 16, 2025
Also Read:
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?