హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): గాంధీజీ విగ్రహం కోసమే ఇండ్ల కూల్చివేత అనేది పూర్తి అబద్ధమని మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్‌గాంధీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో పౌరుల తరలింపు ప్రక్రియపై నెలకొన్న అపోహలను తొలగించాలని ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం ఎక్స్ వేదికగా హితవు పలికారు. బాపూజీ విగ్రహం నిర్మించేందుకే ప్రజల ఇండ్ల్లను తొలగిస్తున్నారనే తప్పుడు ప్రచారం సాగుతున్నదని తెలిపారు. ప్రజల్లో గాంధీజీపై వ్యతిరేకతను పెంచేలా సంఘ్ పరివార్ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఇండ్ల తొలగింపునకు గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధమే లేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు. ‘హైదరాబాద్లోబాపూజీ విగ్ర హం నిర్మించడం కోసమే పౌరుల తరలింపు జరుగుతున్నదనే అపోహలను తొలగించాలని నే ను సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్న. గాం ధీ విగ్రహం వల్లే ప్రజలు తమ ఇండ్లను కోల్పోతున్నారనే ప్రచారం ద్వారా సంఘ్ పరివార్ శక్తులు గాంధీజీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలి’ అని తుషార్‌గాంధీ కోరారు.