Prayagraj Special Trains : శ్రావణ మాసం సమీపిస్తున్న వేళ భక్తులకు ఉత్తర మధ్య రైల్వే(NCR) శాఖ తీపికబురు చెప్పింది. ఆధ్యాత్మిక యాత్రలకు సిద్ధమయ్యే వారి రవాణా సౌకర్యార్థం ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ప్రయాగ్‌రాజ్ నుంచి మూడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దియోగర్లోని బాబా బైద్యనాథ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రాలను కలుపుతూ శ్రావణంలో ఈ ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతామని రైల్వే శాఖ వెల్లడించింది.
ప్రతి ఏడాది వర్షాకాలం సమయంలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తుతారు. శ్రావణ మాసంలో ఈ పుణ్యక్షేత్రంతో పాటు జ్యోతిర్లింగాల దర్శనానికి వచ్చేవారితో రద్దీ మరింత ఎక్కువుంటుంది. అందుకని.. భక్తుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్ నుంచి మూడు జ్లోతిర్లింగాలను కలుపుతూ శనివారం ఉత్తర మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ నుంచి కొత్తగా నడపనున్న రైళ్లలో దియోగర్లోని బాబా బైద్యనాథ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, గుజరాత్‌లోని సోమనాథ్ వంటి ప్రధాన జ్లోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు.
🕉️ A seamless rail journey for Sawan pilgrims.
This Sawan, #NCRailway is operating special trains connecting Prayagraj with three prominent Jyotirlings- Baba Baidyanath Dham (Jasidih), Mahakaleshwar (Ujjain) and Somnath (Veraval)- making pilgrimage easier for devotees.
— North Central Railway (@CPRONCR) July 25, 2026
కొత్తగా ప్రకటించిన రైళ్లలో ప్రయాగ్‌రాజ్ జంక్షన్ – వీరవల్ ప్రయాగ్‌రాజ్ వీక్లీ రైలు (04173/04174) ప్రత్యేకమైనది. ఆగస్టు 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈ రైలు సర్వీసు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి గురువారం ప్రయాగ్‌రాజ్ నుంచి బయల్దేరి.. శుక్రవారం వెరావేల్ స్టేషన్‌కు చేరుకునే ఈ ట్రైన్లో వెళ్లి భక్తులు ద్వారకా సోమనాథుడిని దర్శించుకోవచ్చు. మహాకాళేశ్వర్ నుంచి సుబేదర్‌గంజ్- ఇండోర్ – సుబేదర్‌గంజ్ మధ్య వారంలో రెండుసార్లు నడువనున్న ప్యాసింజర్ రైలు ఉజ్జయినిలో ఆగుతుంది.
🕉️ सावन में आस्था की राह, रेल के साथ
इस सावन, उत्तर मध्य रेलवे की स्पेशल ट्रेनें श्रद्धालुओं को काशी विश्वनाथ (वाराणसी), बाबा बैद्यनाथ धाम (जसीडीह), महाकालेश्वर (उज्जैन) और सोमनाथ (वेरावल) की यात्रा को और अधिक सुगम बना रही हैं।
🚆 04173/04174 प्रयागराज जं.–वेरावल साप्ताहिक… pic.twitter.com/XpmymdMgiC
— North Central Railway (@CPRONCR) July 25, 2026
ఇక బాబా బైద్యనాథ్ ధామ్‌ను దర్శించుకోవాలనుకునే వాళ్లకోసం జసిదిహ్, మధుపుర్ స్టేష్లన ద్వారా ధియోఘర్ చేరుకోవచ్చు. అలానే.. విరంగనా లక్ష్మీబాయి ఘాన్సీ- అసన్సోల్-విరంగనా లక్ష్మీబాయి ఝాన్సీ మధ్య వారంలో రెండు సార్లు ప్రత్యేక రైలు(04185/04186) నడవనుంది. జూలై 29 నుంచి ఆగస్టు 31 వరకూ ఈ ప్రాంతాల మధ్య పది అదనపు ట్రిప్సులు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఒకవేళ భక్తులు కోరినట్టైతే వారణాసిలోని కాశీ విధ్వనాథ ధామ్‌ను దర్శించుకునేందుకు వీలుగా రైలు సర్వీస్ నడిపే విషయాన్ని ఆలోచిస్తామని వారు వెల్లడించారు.