Vehicle Catches Fire | స్తంభాన్ని ఢీకొట్టిన వాహనం.. మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనం
Vehicle Catches Fire | ఒక వాహనం అదుపుతప్పింది. డివైడర్‌తో పాటు స్ట్రీట్ లైట్ పోల్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్ర కాలిన గాయాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
గువాహతి: ఒక వాహనం అదుపుతప్పింది. డివైడర్‌తో పాటు స్ట్రీట్ లైట్ పోల్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్ర కాలిన గాయాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. (Vehicle Catches Fire) అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గువాహతికి కియా కారులో ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున పురానీ గూడంలోని కెనపట్టి ప్రాంతంలో ఆ కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్ మధ్యలోని వీధి లైట్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
కాగా, ఈ ప్రమాదం ధాటికి ఆ కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న నలుగురు అందులో చిక్కుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా కాలిన గాయాలైన మరో ఇద్దరిని గువాహతిలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Assam, Nagaon 🚨⚠️
Arunachal Regd. KIA Carens, overspeeding on 4 lane highway probably around curve, lost control… rammed street light pole & toppled otherside…within few seconds car caught fire, probably fuel lines damaged…3 Dead, 2 injured. Luckily no vehicles on left lane… pic.twitter.com/XYn8xKIwpU
— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

