Danam Nagender | సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో దానం సెట్‌రైట్.. ఎన్నికలకు సిద్ధమవుతానని ప్రకటన..!
Danam Nagender | గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కనీసం ఆరు నెలలైనా తిరగకముందే అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయిన దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
Danam Nagender : గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కనీసం ఆరు నెలలైనా తిరగకముందే అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయిన దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
సుప్రీంకోర్టు షాక్‌తో దిమ్మతిరిగిపోయిన దానం.. ఇక ఎన్నికలకు సిద్ధమవుతానని ప్రకటించారు. కాగా బీఆరెస్ పార్టీ నుంచి గెలిచిన దానం రెండేళ్లకుపైగా అక్రమంగా పదవిని అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీతో అంటకాగారు. ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ కూడా చేశారు. దాంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు వేశారు.
విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇటీవల దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో దానంకు దిమ్మతిరిగింది. దాంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా గౌరవిస్తున్నానని ప్రకటించారు. చట్టపరమైన ప్రక్రియ పట్ల ఉన్న గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని చెప్పారు. ఇక తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని అన్నారు.
కోర్టు తీర్పు ఇలా వస్తుందని తాను ముందే ఊహించానని దానం అన్నారు. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం కొంత ఊరట లభిస్తుందని భావించానని చెప్పారు. అందుకే చట్టపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో తాను సిద్ధంగా ఉన్నట్లు దానం తెలిపారు. ఖైరతాబాద్ ప్రజలతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. రాబోయే ఉపఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరతానన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

