Lawyer Gandra Mohan Rao | ‘బీఆర్ఎస్ పార్టీకి ఇదొక గొప్ప విజయం.. మిగతా ఎమ్మెల్యేలు కూడా..’
Lawyer Gandra Mohan Rao | త్వరలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ మొదటి రోజు నుంచి న్యాయపోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ఇదొక గొప్ప విజయమని బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు స్పష్టం చేశారు.
Lawyer Gandra Mohan Rao | దానం నాగేందర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ ఇవ్వకుండా అడ్మిషన్ స్టేజీలోనే కొట్టివేయడం జరిగిందని బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. దానం నాగేందర్‌పై అనర్హత వేసిన సుప్రీంకోర్టు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో న్యాయవాది గండ్ర మోహన్ రావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నువ్వొకసారి వేరే పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా నీకు అనర్హత చట్టం వరిస్తుందని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దాని తర్వాత జరిగిన పరిణామాలతో సంబంధం లేదని గౌరవ సుప్రీంకోర్టు కొట్టేసింది. వారి కౌన్సిల్ వాదించడానికి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాపై చర్యలు తీసుకోలేదు. నేనింకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా కాబట్టి నాకు ఇంకా అనర్హత వర్తించదని అన్నారు.
దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన 3 రోజుల్లోనే స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పా. కానీ స్పీకర్ వద్ద నుంచి సరైన స్పందన రాకపోవడంతో, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసిందన్నారు. దీంతో త్వరలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ మొదటి రోజు నుంచి న్యాయపోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ఇదొక గొప్ప విజయం. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా డివిజన్ బెంచ్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వారికి కూడా ఇలాగే జరగబోతుందని ఆశిస్తున్నామన్నారు.
దానం నాగేందర్ వేసిన పిటిషన్‌ను గౌరవ సుప్రీంకోర్టు కొట్టేసింది.
దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన 3 రోజుల్లోనే స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.
కానీ స్పీకర్ వద్ద నుంచి సరైన స్పందన రాకపోవడంతో, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసింది.త్వరలో… pic.twitter.com/6Jf5PvXInq
— BRS Party (@BRSparty) September 24, 2026
Read Also :
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

