Shah Rukh Khan | రూ.2,490 కోట్లు తగ్గిన షారుఖ్ ఖాన్ సంపద.. అసలు కారణం ఇదే!
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆస్తికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆస్తికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని ధనవంతుల జాబితాను రూపొందించే ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే షారుఖ్ ఖాన్ ఆస్తి కాస్త తగ్గింది. గతేడాది ఆయన ఆస్తి విలువ రూ. 12,490 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది అది రూ. 2,490 కోట్లు తగ్గి రూ. 10,000 కోట్లకు చేరింది. ఆయన వ్యాపారాలు, నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’, ఐపీఎల్ టీమ్ ‘కోల్కత్తా నైట్ రైడర్స్’ వంటి వాటిని లెక్కలోకి తీసుకుని ఈ అంచనా వేశారు. ఆస్తి కొంత తగ్గినా సరే, భారతదేశంలో అత్యధిక ఆస్తులున్న నటుడిగా షారుఖ్ ఖాన్ మాత్రం తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ రూ. 4,000 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, సల్మాన్ ఖాన్ (రూ. 3,000 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2,500 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మరోవైపు సినిమాల విషయంలో షారుఖ్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా ‘కింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

