Ameer Log | డబ్బున్నోళ్లు అమీర్ లోగా..? సంతోషంగా ఉండేవాళ్లా..? : డైరెక్టర్ రమణారెడ్డి సోమ
Ameer Log | రమణారెడ్డి సోమ డైరెక్షన్లో రాబోతున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అమీర్ లోగ్ (Ameer Log) ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ డేట్ ప్రకటించడంతోపాటు అవ్వల్ దావత్ సాంగ్ విడుదల చేశారు.
Ameer Log | రమణారెడ్డి సోమ డైరెక్షన్లో రాబోతున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అమీర్ లోగ్ (Ameer Log). ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ డేట్ ప్రకటించడంతోపాటు అవ్వల్ దావత్ సాంగ్ విడుదల చేశారు.
ఈవెంట్లో డైరెక్టర్ రమణారెడ్డి సోమ మాట్లాడుతూ.. మాది నల్గొండలోని రాఘవపురం. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నివసించాను. హైదరాబాద్ మనుషులను చూపించాలని అమీర్ లోగ్ తీశానని అన్నాడు. డబ్బున్నోళ్లు అమీర్ లోగా..? సంతోషంగా ఉండేవాళ్లు అమీర్ లోగా..? అనేది ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ మూవీలో ఫిలాసఫీ ఉంటుంది.. అలా అని ఏదో నీతి బోధ చేసినట్టుగాఉండదు. ఈ సినిమా చూశాక హైదరాబాద్ మనుషుల మీద ప్రేమ, గౌరవం మరింత పెరుగుతుంది.. అది మాత్రం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశాడు.
అమీర్ లోగ్ నుంచి విడుదల చేసిన అవ్వల్ దావత్ సాంగ్ అదిరిపోయింది.. ఆగస్టు 21న మా సినిమా రాబోతుంది.. థియేటర్లోకి సినిమా వచ్చిన తర్వాత మా ప్రపంచంలోకి, మా బస్తీలోకి తీసుకెళ్తాం.. అందరినీ ఇంప్రెస్ చేస్తాం.. అని చెప్పుకొచ్చాడు యాక్టర్ ఎంసీ హరి. తాను అమీర్‌లోగ్ సినిమాలో చూపించే బస్తీలోనే పుట్టి పెరిగానని నిర్మాత మాధవి రెడ్డి చెప్పింది. అక్కడి నుంచి ఇక్కడిదాకా రావడానికి కారణం నా భర్త రమణారెడ్డి అని చెప్పుకొచ్చింది.
అమీర్ లోగ్ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను టాలీవుడ్ యాక్టర్ రానాకు చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకుందని తెలిసిందే. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న ఈ సినిమాపై తాజా సాంగ్ అంచనాలు మరింత పెంచేస్తుంది. అమీర్ లోగ్ మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.
Mana Hyderabad Andam Mottham Oke Frame Lo Chupinche Cinema! ❤️ – Director #RamanaReddy Speech at Ameerlog Awwal Dawath Song Launch & Release date announcement Event
▶️https://t.co/047LpI7I0r#Ameerlog releasing on 21st August 2026 in theatres! ❤️🎥#AwwalNumber #SpiritMedia… pic.twitter.com/z5ZIFcdq79
— YouWe Media (@MediaYouwe) July 25, 2026
Read Also :
అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఎంపిక
Chennai Love Story | ‘చెన్నై లవ్ స్టోరీ’కి బాక్సాఫీస్ దగ్గర అదిరే ఆరంభం.. బుక్‌మైషోలో రికార్డు టికెట్ సేల్స్
US water Crisis | అగ్రరాజ్యంలోని ఆ నగరంలో నీటి కటకట.. ఏళ్లుగా కొనసాగుతున్న కరువే కారణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

