పింఛన్ల పంపిణీ రసాభాస
ఎల్బీనగర్ నియోజకవర్గంలో చంపాపేట మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం, ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమంలో పాల్గొన్న వైనంపై ప్రశ్నిస్తున్న క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసుకునే స్థాయికి చేరుకుంది.
- కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల తోపులాట
- ప్రొటోకాల్ పాటించని కాంగ్రెస్ నేతలు
- మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలతో నిండిపోయిన వేదిక
- నిరసనకు దిగిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. పోలీసుల మౌనం
ఎల్బీనగర్/ చంపాపేట్, నవంబర్ 18: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చంపాపేట మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం, ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమంలో పాల్గొన్న వైనంపై ప్రశ్నిస్తున్న క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసుకునే స్థాయికి చేరుకుంది. వేదికపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు అంతా మూకుమ్మడిగా కూర్చుని కయ్యానికి కాలు దువ్వినట్లుగా వ్యవహరించారు. అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ ఏదీ అంటూ స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారుల సమక్షంలో ప్రశ్నించారు. ఈ వేదికపై..కాంగ్రెస్ వారికి ఏంపని, ప్రొటోకాల్ పాటించేది లేదా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్న క్రమంలోనే ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల నినాదాలు, ప్రతినినాదాలతో పాటుగా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేతో పాటుగా బీఆర్ఎస్ నాయకులను కిందికి తోతొసుకుంటూ వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సభా ప్రాంగణంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
లబ్ధిదారుల అయోమయం..
చేయూత పెన్షన్ల కోసం వచ్చిన లబ్ధ్దిదారులు ఈ సంఘటనతో అయోమయానికి గురికాగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన ఎంఎంసీ అధికారులు తలోదిక్కుకు వెళ్లిపోయారు. వేదికమీద ఉన్న అధికారులు సైతం ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలగా కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ వైఖరిని సమర్థించుకునే రీతిలో మరింత పెద్దగా నినాదాలు చేశారు. వేదికపై ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మిన్నకుండిపోగా కాంగ్రెస్ నాయకులు వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. లబ్ధ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలోనూ రభస చేయడం పట్ల లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణం వద్ద పోలీసుల తీరుతో పాటుగా ఎంఎంసీ అధికారుల తీరు కూడా సర్వత్రా వివాదాస్పదయ్యింది.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిరసన..
ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యే ప్రశ్నించిన వెంటనే పోలీసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులను స్టేజ్‌పై నుంచి తోసుకుంటూ కిందికి తీసుకుని వచ్చారు. దీంతో వేదిక కిందనే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కార్యకర్తలతో బైఠయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్లు నేరుగా పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఇదేమిరాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ నాయకులు కూడా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులను సభా ప్రాంగణం నుంచి బయటకు తరలించారు.
కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా అధికారులు
చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వివాదానికి అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల తీరే ప్రధాన కారణం. మేము 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో చంపాపేట మల్టీపర్పస్ హాల్ వద్దకు వచ్చినా హాల్లోకి వెళ్లకుండా హాల్ బయటే 2 గంటలుగా వేచి ఉన్నాము. హాల్లో ఉన్న లబ్దిదారులకు ఇబ్బంది కలుగకూడదనే ఇలా బయట ఉన్నాం. అయితే రెండు గంటల తర్వాత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో పాటుగా మధుయాష్కీ గౌడ్ రావడం ఆయన వెంట 100 మంది కాంగ్రెస్ నాయకులు హాల్లోకి నేరుగా వెళ్లడమే కాకుండా ప్రొటోకాల్ లేకుండానే వేదికపై కూర్చున్నారు. మేము కూడా హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేగా మీరు ఒక్కరే వెళ్లాలంటూ పేర్కొన్నారు.
తాము పోలీసులను దాటుకుని వేదిక వద్దకు చేరుకున్నప్పటికే అధికారిక కార్యక్రమంలో వేదిక అంతా కాంగ్రెస్ నాయకులతో నిండిపోయింది. సమావేశం ప్రారంభం కాగానే ఉప కమిషనర్, జోనల్ కమిషనర్లు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ ఇది అధికారిక కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించాను. ఇలా అధికారులను ప్రశ్నిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం, చైతన్యపురి సీఐ సైదులు, ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్‌రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తాం.
దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎల్బీనగర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

