భూనిర్వాసితుల కడగండ్లు తీర్చేనా?
నాడు నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష..నేడు వారి సమస్యలపై మౌనం ఎందుకు? నాడు కన్నీళ్లు తుడుస్తానన్నారు..నేడు కష్టాలు కనిపించడం లేదా? ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట..అధికారంలో ఉన్నపుడు మరో మాటా? మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ బాధితుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వైఖరికి కాలమే సాక్ష్యం! నాడు నిర్వాసితుల కోసం ఆయన రోడ్డెక్కారు.. నిరాహార దీక్షలు చేశారు..ప్రభుత్వాన్ని నిలదీశారు. నేడు ముఖ్యమంత్రి హోదాలో అదే బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఎంతో ఉన్నది.
నాడు నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష..నేడు వారి సమస్యలపై మౌనం ఎందుకు? నాడు కన్నీళ్లు తుడుస్తానన్నారు..నేడు కష్టాలు కనిపించడం లేదా? ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట..అధికారంలో ఉన్నపుడు మరో మాటా? మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ బాధితుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వైఖరికి కాలమే సాక్ష్యం! నాడు నిర్వాసితుల కోసం ఆయన రోడ్డెక్కారు.. నిరాహార దీక్షలు చేశారు..ప్రభుత్వాన్ని నిలదీశారు. నేడు ముఖ్యమంత్రి హోదాలో అదే బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఎంతో ఉన్నది.
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి స్వయంగా నిర్వాసితుల పక్షాన చాలా డిమాండ్లు చేశారు. అప్పటి ప్రభుత్వం భూసేకరణ కోసం తీసుకొచ్చిన జీవో 123ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, వివిధ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని అన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019లో టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో గజ్వేల్‌లో రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఆ పార్టీ నాయకుడు నర్సారెడ్డికి ఆయన మద్దతు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా గజ్వేల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ బాధితుల సమస్యలు రేవంత్‌రెడ్డికి కొత్తగా తెలిసినవి కావు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన అభయహస్తం మ్యానిఫెస్టోలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నది.
2013 భూసేకరణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, భూసేకరణ పరిహారాన్ని సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. అసైన్డ్, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం అందిస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ హామీల్లో చోటు సంపాదించాయి. ఇప్పుడు అవే హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం. ఈ ప్రాజెక్టు ద్వారా అనేక ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతున్నప్పటికీ, ఇందుకోసం తమ భూములు, ఇండ్లు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లోనూ అభివృద్ధి కనిపించాలి. గత ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్‌కు సంబంధించి దాదాపు 90 శాతం పునరావాసం, పునఃస్థాపన పనులు పూర్తయినట్లు బీఆర్ఎస్ నాయకులతో పాటు పోరాటం చేస్తున్న ముంపు బాధితుల సంఘం నాయకులు కూడా పేర్కొంటున్నారు. 2025 ఫిబ్రవరిలో బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్‌రావు సైతం 90 శాతం ఆర్అండ్ఆర్ పనులు పూర్తయ్యాయని, కేవలం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ మిగిలిన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అర్హులైన నిర్వాసితులకు పరిహారం, ఇండ్ల స్థలాలు, పునరావాస ప్రయోజనాలు అందించాలి. ఒక్కో కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి అధికారులతో సమీక్షించి పరిష్కరించాలి.
ఇప్పటికే మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిహారం, పునరావాస ప్రయోజనాల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. 2026 సెప్టెంబర్‌లో హైకోర్టు తొగుట, రాంపూర్ ప్రాంతాలకు చెందిన కొందరు చిన్న, సన్నకారు రైతుల పిటిషన్లపై విచారణ సందర్భంగా అర్హులకు పునరావాస, పునఃస్థాపన ప్రయోజనాలు నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారి అర్హతలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ పరిణామాలు.. నిర్వాసితుల సమస్యలు ఇంకా పూర్తిగా ముగియలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. నాడు ప్రశ్నించిన నాయకుడే..నేడు పరిష్కరించాల్సిన పాలకుడు! ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతున్నది. గతంలో తాను డిమాండ్ చేసిన పరిహారం, పునరావాసం, నిర్వాసితుల హక్కులకు సంబంధించిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీదనే ఉన్నది.
సీఎం నేడు సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నిర్వాసితుల సమస్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఈ పర్యటనలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి గడువు నిర్ణయించాలి. బాధితులతో నేరుగా మాట్లాడి వారికి స్పష్టమైన భరోసా కల్పించాలి. ముఖ్యమంత్రి హోదాలో ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి తన పూర్వపు మాటలకు కార్యరూపం ఇస్తారా? లేదా? వేచిచూడాలి.
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
జీడిపల్లి రాంరెడ్డి
96666 80051
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

