Punjab woman | కెనడాలో పంజాబ్ యువతి హత్య.. భారతీయ యువకుడు అరెస్ట్
Punjab woman : పంజాబ్‌కు చెందిన భారతీయ యువతి కెనడాలో హత్యకు గురైంది. ఆమె సహజీనవం చేస్తున్న భారతీయ యువకుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Punjab woman : పంజాబ్‌కు చెందిన భారతీయ యువతి కెనడాలో హత్యకు గురైంది. ఆమె సహజీనవం చేస్తున్న భారతీయ యువకుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. పంజాబ్‌లోని సమ్రాలాలకు చెందిన దమన్‌ప్రీత్ కౌర్ (23) అనే యువతి కెనడాలోని ఎడ్మాంటన్ సిటీలో చదువుకుంటోంది. స్టూడెంట్ వీసా మీద ఉన్న ఆమె అక్కడి సిల్వర్బెర్రీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు ఎడ్మాంటన్ పోలీస్ సర్వీస్‌కు సమాచారం అందింది.
జూలై 9న తన నివాసంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను ఎమర్జెన్సీ బృందాలు ఆస్పత్రికి తరలించాయి. అక్కడ చికిత్స పొందుతూ జూలై 12న మరణించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఊపిరాడకుండా చేయడం వల్లే కౌర్ మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఇది హత్య అని వైద్యులు ధృవీకరించారు. దీంతో మరింత లోతుగా విచారణ జరిపిన పోలీసులు ఈ నెల 22న రితీష్ కుమార్ (22)అనే భారతీయ యువకుడిని అరెస్టు చేశారు. అతడి హత్య కేసు నమోదు చేశారు. అతడు కౌర్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడే ఈ హత్య చేశాడని, ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం లేదని పోలీసులు ప్రకటించారు.
కౌర్ మృతిపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌర్.. ఐదేళ్లక్రితం ఉన్నత చదువు కోసం కెనడా వెళ్లిందని, ఆమె చదువు కోసం తామెంతో అప్పు చేశామని ఆవేదనగా తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి సాయం చేసేందుకు ఒక సంస్థ విరాళాల సేకరణ నిర్వహిస్తోంది. ఇందుకోసం 20,000 డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 18,000 డాలర్ల వరకు విరాళాలు అందాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

