Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేని ఎక్కడ..? ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డారా..? ఇరాన్ మీడియా హింట్
Mojtaba Khamenei : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనిని ఆ దేశ అసెంబ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత కూడా మొజ్తాబా ఖమేని ఎక్కడా కనిపించడం లేదు.
Mojtaba Khamenei : ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనిని ఆ దేశ అసెంబ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత కూడా మొజ్తాబా ఖమేని ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల ముందుకు రాలేదు. బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఒక అధికారిక టీవీ ఛానెల్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ మీడియా మొజ్తాబా ఖమేనిని ‘జాన్బాజ్ ఆఫ్ రమదాన్’ అని అభివర్ణించింది.
అంటే యుద్ధంలో గాయపడిన వాడు అని అర్ధం. రంజాన్ సమయంలో జరుగుతున్న యుద్ధం కావడంతో కూడా ఇలా వర్ణించింది. యుద్ధంలో శతృవుల ద్వారా ఖమేని గాయపడినట్లు చేసిన ప్రకటనతో.. ఆయన తాజా యుద్ధంలో గాయపడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత కానీ, తన తండ్రి, భార్య, కుటుంబం మరణించిన తర్వాత కానీ ఆయన ఎప్పుడూ బయట కనిపించలేదు. ఆయనకు సంబంధించిన ఒక ఫొటో, వీడియో కూడా బయటకు రాలేదు. ఆయన్నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో ఆయన గాయపడ్డారేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, ఇరాన్ ఛానెల్ చెప్పినట్లు యుద్ధంలో గాయపడటం అంటే ఆయన శరీరానికి అయిన గాయంగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని కోల్పోవడం కూడా గాయం కిందే లెక్క.
దీంతో మొజ్తాబా నిజంగానే గాయపడ్డారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆయన ఎక్కడున్నారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇక.. మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతోనే ఉన్నాడు. అతడి ఎంపికపై అసంతృప్తితో ఉన్న ట్రంప్.. మొజ్తాబా మనశాంతిగా ఉంటాడని తాను భావించడం లేదన్నారు. మొజ్తాబా ఎంపికను తాను అంగీకరించబోనని, అతడి బదులు ఇరాన్లో శాంతిని, సామరస్యాన్ని నింపే నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
Sanjay Raut | నాగ్‌పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చండి: సంజయ్ రౌత్
‘9+12 విద్యా విధానంతో డ్రాప్ అవుట్లకు చెక్’
JEE Main | రేపటితో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు..!
‘చిన్ననాటి నుండే శ్రమ, క్రమశిక్షణ అలవర్చుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

