రాంచీ: ఆరోగ్య మంత్రి కుమారుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తనిఖీ చేశాడు. సమస్యల గురించి రోగులను అడిగి తెలుసుకున్నాడు. (Minister’s Son Inspects Hospital) రికార్డ్ చేసిన ఈ రీల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది రాజకీయ వివాదానికి దారి తీసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ నేత ఇర్ఫాన్ అన్సారీ కుమారుడైన 19 ఏళ్ల క్రిష్ అన్సారీ ఉత్తరాఖండ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సెలవు నిమిత్తం జార్ఖండ్‌లోని సొంత ఇంటికి వచ్చాడు. శనివారం తన స్నేహితులతో కలిసి రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను సందర్శించాడు. ఒక వార్డును తనిఖీ చేశాడు. ఏదైనా అసౌకర్యం ఎదుర్కొంటున్నారా అని అక్కడి రోగులను అడిగాడు. ఈ సందర్భంగా రీల్ రికార్డ్ చేశాడు. పంజాబీ సాంగ్‌తో కూడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ సాహ్ దీనిపై స్పందించారు. ‘జార్ఖండ్ రీల్ మంత్రి కుమారుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయడం, రీల్స్ చేయడం ప్రారంభించాడు’ అని ఎక్స్‌లో ఆరోపించారు.
మరోవైపు బీజేపీ ఆరోపణలను మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఖండించారు. టీచర్ తల్లిని హాస్పిటల్లో చేర్పించడం కోసం తన కుమారుడు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. నా పిల్లలకు మంచి విలువలు నేర్పించానని, వారు మానవత్వం చాటుతారని, ఇతరులకు సహాయం చేస్తారని చెప్పారు. రాజకీయంగా గొడవ ఉంటే తనతో పోరాడాలని, అంతేగాని కుటుంబం లేదా పిల్లలను వివాదంలోకి లాగవద్దని అన్నారు.
झारखंड के रील मंत्री के पुत्र भी अब सरकारी अस्पतालों का निरीक्षण कर रील बनाने लगे है #BJP #Jharkhand @yourBabulal pic.twitter.com/GYF0Nm2reK
— Ajay Sah (@ajaysahspeaks) July 19, 2025
बीजेपी संयम रखें। अच्छी सोच के साथ आगे बड़े. अगर आप को लड़ाई हमसे है तो हमसे लड़े। परिवार या बच्चों को शामिल न करें। मैंने अपने बच्चों को अच्छा संस्कार दिया है। चाहे वो मेरा बेटा हो, चाहे वो मेरा कार्यकर्ता हो। इंसानियत को मदद करेगा. लोगों का इलाज कराएगा उसकी जान बचाएगा.।… pic.twitter.com/DMn8AikwFV
— Dr. Irfan Ansari (@IrfanAnsariMLA) July 20, 2025
Also Read:
Kanwariyas | సీఆర్పీఎఫ్ జవాన్‌ను కొట్టి, కాళ్లతో తన్నిన కన్వారియాలు.. వీడియో వైరల్
Cop’s Son Car Race | పోలీస్ కుమారుడు కారు రేస్.. నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
Boy Assaulted | స్కూల్ గ్రౌండ్లో బాలుడిపై లైంగిక దాడి.. ఇద్దరు యువకులు అరెస్ట్