అహ్మదాబాద్: ఒక పోలీస్ కుమారుడు తన ఫ్రెండ్‌తో కలిసి కారు రేస్‌లో పాల్గొన్నాడు. (Cop’s Son Car Race) రద్దీ రోడ్డులో వేగంగా వాహనాన్ని డ్రైవ్ చేశాడు. అదుపుతప్పిన ఆ కారు నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. క్రైమ్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) అనిరుద్ధ సింగ్ వజుభా గోహిల్ కుమారుడైన 20 ఏళ్ల హర్షరాజ్కు కారు రేస్ అంటే పిచ్చి. పలుమార్లు తన స్నేహితులతో కలిసి రేస్‌లతో ఎంజాయ్ చేశాడు.
కాగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో హర్షరాజ్ తన ఫ్రెండ్‌తో కలిసి కారు రేస్‌లో పాల్గొన్నాడు. అతడు క్రెటాను డ్రైవ్ చేయగా, ఎరుపు రంగు బ్రెజ్జా కారును స్నేహితుడు నడిపాడు. రేస్‌లో భాగంగా 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని హర్షరాజ్ డ్రైవ్ చేశాడు. కలియాబీడ్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్డులో వాహనంపై అదుపు కోల్పాయాడు. దీంతో రోడ్డుపై నడుస్తున్న ఇద్దరిని వాహనంతో బలంగా ఢీకొట్టాడు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులను 30 ఏళ్ల భార్గవ్ భట్, 65 ఏళ్ల చంపాబెన్ వాచానిగా గుర్తించారు.
మరోవైపు రోడ్డుపై స్కిడ్ అయిన హర్షరాజ్ వాహనం ఒక స్కూటర్‌ను ఢీకొట్టింది. టైర్లు పగలడంతో ఆ స్కూటర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న తండ్రి అయిన పోలీస్ అధికారి అనిరుద్ధ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. కుమారుడు హర్షరాజ్ను కొట్టి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు అతడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
2 killed as ‘speeding’ car driven by ASI’s son rams into pedestrians in Gujarat’s #Bhavnagar
Read more here: https://t.co/ydQnyQYIRb pic.twitter.com/jj2bCugw7f
— The Indian Express (@IndianExpress) July 19, 2025
Also Read:
Girl set on fire | ఒడిశాలో మరో దారుణం.. అమ్మాయికి నిప్పంటించిన ముగ్గురు
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?