లక్నో: కన్వారియాలు (Kanwariyas) రెచ్చిపోయారు. రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ జవాన్‌పై దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌కు కొందరు కన్వారియాలు చేరుకున్నారు. రైలు టిక్కెట్లు కొనే విషయంలో అక్కడున్న సీఆర్పీఎఫ్ జవాన్‌తో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతడ్ని కొట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఆయనను కిందపడేసి కాళ్లతో తన్నారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఆ జవాన్‌ను కాపాడారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్‌పై దాడి చేసిన కన్వారియాలపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత ఏడుగురు కన్వారియాలను అరెస్ట్ చేసినట్లు ఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్‌పై కన్వారియాలు దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश के एक रेलवे स्टेशन पर कांवड़ियों ने CRPF जवान की बेरहमी से पिटाई कर दी।
बेशर्म संघी इसका भी बचाव करेंगे।
— Ankit Yadav (@Ankitydv92) July 19, 2025
Also Read:
Boy Assaulted | స్కూల్ గ్రౌండ్లో బాలుడిపై లైంగిక దాడి.. ఇద్దరు యువకులు అరెస్ట్
Cop’s Son Car Race | పోలీస్ కుమారుడు కారు రేస్.. నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?