భోపాల్: అరెస్ట్ చేసిన గ్యాంగ్‌స్టర్‌కు పోలీసులు గుండు కొట్టించారు. అతడి మీసాలు తీయించారు. ఆ తర్వాత బహిరంగంగా ఊరేగించారు. (Cops Parade Gangster, Shaved Head) దీంతో గ్యాంగ్‌స్టర్ భార్య హై కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. గ్యాంగ్‌స్టర్ జుబైర్ మౌలానాపై హత్యాయత్నం, దాడి, కిడ్నాప్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోలీస్ బృందంపై దాడి వంటి 50కు పైగా కేసులు పలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. 30,000 రివార్డుతో వాంటెడ్ నేరస్తుడిగాను అతడ్ని ప్రకటించారు.
కాగా, ఆరు నెలలుగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ జుబైర్ మౌలానా, అతడి ముగ్గురు అనుచరులను మే 9న భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జుబైర్‌కు గుండు చేయించారు. అతడి గడ్డం, మీసాలు తీయించారు. కాళ్లకు కట్టుతో కుంటుతున్న ఆ గ్యాంగ్స్టర్లను బహిరంగంగా ఊరేగించారు.
మరోవైపు గ్యాంగ్‌స్టర్ జుబైర్ మౌలానా భార్య షమీమ్ బానో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22, 25 కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించింది. పోలీసుల చర్య అమానవీయం, అవమానకరమని పిటిషన్లో పేర్కొన్నది. బాధ్యులైన పోలీస్ అధికారులపై కేసు నమోదు చేయాలని, వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది.
కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జబల్పూర్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది.
Also Read:
Cop’s Son Car Race | పోలీస్ కుమారుడు కారు రేస్.. నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
Boy Assaulted | స్కూల్ గ్రౌండ్లో బాలుడిపై లైంగిక దాడి.. ఇద్దరు యువకులు అరెస్ట్
Girl set on fire | ఒడిశాలో మరో దారుణం.. అమ్మాయికి నిప్పంటించిన ముగ్గురు
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?