భోపాల్: స్కూల్ గ్రాండ్లో ఉన్న బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అసహజ పద్ధతుల్లో లైంగిక చర్యల కోసం అతడ్ని బలవంతం చేశారు. (Boy Assaulted) ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. జూలై 17న ఒక ప్రభుత్వ స్కూల్ క్యాంపస్‌లోని గ్రౌండ్లో 13 ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే ఆ స్కూల్‌కు చెందని ఇద్దరు యువకులు అతడ్ని లైంగికంగా వేధించారు. అసహజ లైంగిక చర్యల కోసం ఆ బాలుడ్ని బలవంతం చేశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం బాధిత బాలుడ్ని హాస్పిటల్‌కు తరలించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 16, 17 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
మరోవైపు నిందితులిద్దరూ స్థానిక యువకులని పోలీస్ అధికారి తెలిపారు. ఒక యవకుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. వారిద్దరూ తరచుగా స్కూల్ గ్రౌండ్‌కు వెళ్తుంటారని వెల్లడించారు. అయితే ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందించారని, వైద్య పరీక్షల్లో జాప్యం జరిగిందని బాధిత బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు.
Also Read:
Girl set on fire | ఒడిశాలో మరో దారుణం.. అమ్మాయికి నిప్పంటించిన ముగ్గురు
Cop’s Son Car Race | పోలీస్ కుమారుడు కారు రేస్.. నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?