Varalaxmi Sarathkumar | హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై వివాదం… ఘాటుగా స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్
Varalaxmi Sarathkumar | హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
Varalaxmi Sarathkumar | హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకత్వం వహించిన సరస్వతి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలపై మాట్లాడారు. నటిగా ఉన్నప్పుడు తన పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుందని, కానీ దర్శకురాలిగా మొత్తం సినిమాను చూసుకోవాల్సి రావడం చాలా పెద్ద బాధ్యత అని తెలిపారు. నటనతో పోలిస్తే దర్శకత్వం పూర్తిగా భిన్నమైన అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా నటీమణుల డ్రెస్సింగ్‌పై వస్తున్న విమర్శల గురించి కూడా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక వ్యక్తి ఏ దుస్తులు వేసుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని, దానిపై ఇతరులు తీర్పు ఇవ్వడం సరైంది కాదని ఆమె అన్నారు. మీకొక చెల్లి ఉంటే ఆమె షార్ట్ వేసుకుని బయటకు వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? మహిళల డ్రెస్సింగ్‌ను ఎందుకు తప్పుబడతారు? ఒక అమ్మాయి బ్రా స్ట్రాప్ అనుకోకుండా బయటకు కనిపిస్తే అది పెద్ద తప్పు చేసినట్లుగా లేదా ప్రపంచమే అంతమైపోయినట్లుగా ఎందుకు చూస్తారని ఆమె ప్రశ్నించారు. బ్రా అనేది కేవలం ఒక ఇన్నర్‌వేర్ మాత్రమేనని, అది మహిళలకు సాధారణమైన మరియు అవసరమైన వస్త్రమని ఆమె స్పష్టం చేశారు వరలక్ష్మీ శరత్ కుమార్. మగవారి దుస్తులతో పోల్చుతూ కూడా వరలక్ష్మి ఒక ఉదాహరణ ఇచ్చారు.
మగవారు జీన్స్ ప్యాంట్ వేసుకుని వంగినప్పుడు వారి లోదుస్తులు కనిపించడం సాధారణమేనని, కానీ దాన్ని చూసి ఎలాంటి మహిళా వారిపై అఘాయిత్యాలకు పాల్పడదు కదా అని ఆమె అన్నారు. మరి మగవారి విషయంలో అభ్యంతరం లేకపోతే, మహిళల విషయంలో మాత్రమే ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ విధమైన ద్వంద్వ వైఖరి సమాజంలో మారాల్సిన అవసరం ఉందని వరలక్ష్మి స్పష్టం చేశారు. మహిళల దుస్తులను విమర్శించడం కంటే, మనుషుల ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అత్యంత ముఖ్యమని, వారి వ్యక్తిగత స్వేచ్ఛను అందరూ గౌరవించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే మహిళల హక్కులు, స్వేచ్ఛలపై ఈ చర్చ మళ్లీ ప్రధాన అంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dreesing
- female
- Male
- Saraswathi
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

