Infant | పసికందు అమ్మకం.. ఆర్థిక ఇబ్బందులే కారణం.. !
Infant | మెదక్ జిల్లా పరిధిలోని రింగనాయకులపల్లి తండాలో సుమారు 25 రోజుల పసికందును అమ్మినట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు.
Infant | మెదక్ అర్బన్ , మార్చి 10: మెదక్ జిల్లాలో పసికందు అమ్మకం ఘటన వెలుగులోకి వచ్చిందని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. మంగళవారం మెదక్ డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా పరిధిలోని రింగనాయకులపల్లి తండాలో సుమారు 25 రోజుల పసికందును అమ్మినట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు.
అధికారుల వివరాల ప్రకారం ఈ ఘటన ఈ నెల 4వ తేదీన జరిగినట్లు గుర్తించారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో తల్లి పసికందును మరో కుటుంబానికి అప్పగించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మార్చి 9న పసికందును గుర్తించి అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు.
అనంతరం ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణలో ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి శిశువు తల్లి, శిశువును తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also :
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- ICDS officers
- Infant
- medak
- Mother
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

