Harish Rao | ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క, సారక్క ప్రాజెక్టును ఏపీ కోసం వదులుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నదని వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ సమావేశంలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల మన రాష్ట్ర వాటాను ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా..? చెప్పాలన్నారు. మీరు కర్ణాటక సమావేశం తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ తర్వాత 47 టీఎంసీలు వదులుకుంటున్నరని వార్తలు వచ్చినయి. ప్రభుత్వం స్పందన లేదన్నారు.
ఇప్పుడు GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. దీని మీద మీ స్టాండ్ ఏంటి..? ఈ 47 టీఎంసీలను వదులుకున్నరా..వదులుకోలేదా..? అని హరీశ్ రావు అడిగారు. ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది..?ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి.. తెలంగాణ ప్రభుత్వం స్టాండ్ ఏంటి..? ఎట్లా వదులుకుంటరు మీరు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. GRMB అజెండాలో తెలంగాణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. తెలంగాణను పోరాటాలతో తెచ్చుకున్నాం.. నీళ్ల కోసం కొట్లాడాం.. అదే నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు జాగ్రత్త చంద్రబాబు నాయుడు అని హెచ్చరించారు.
47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా?
కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు… https://t.co/FLICMT0HPI pic.twitter.com/Xsjed0iQns
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026
చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నాడు
GRMB అజెండాలో తెలంగాణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది
తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది
తెలంగాణను పోరాటాలతో… https://t.co/t0ClwsKNjV pic.twitter.com/R1ugBZkMys
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026