Malaysia PM : బ్రిక్స్ సమావేశాల సందర్భంగా వివాదాస్పద ఇస్లాం మతగురువు జకీర్ నాయక్(Zakir Naik)ను భారత్‌కు అప్పగించే విషయమై చర్చించామని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం(Anwar Ibrahim) వెల్లడించారు. న్యూ ఢిల్లీలో శనివారం చర్చల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన అంతర్గత చర్చల్లో జకీర్ ప్రస్తావన వచ్చిందని ఆయన తెలిపారు. అయితే.. పరారీలో ఉన్న వ్యక్తిని అప్పగించే విషయంలో తాము మలేషియా చట్టాలకు లోబడి వ్యవహరిస్తామని అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు.
పద్దెనిమిదో బ్రిక్స్ సదస్సుకు విచ్చేసిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన అంతర్గత చర్చల్లో వివాదాస్పద ఇస్లాం మతగురువు, మనీలాండరింగ్ నిందితుడు జకీర్ నాయక్ గురించి మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జకీర్‌ను భారత్‌కు అప్పగించే విషయమై తాము చర్చించామని ఇబ్రహీం పేర్కొన్నారు.
#NDTVExclusive | “Zakir Naik extradition discussed”: Malaysian Prime Minister Anwar Ibrahim (@anwaribrahim) to @VishnuNDTV pic.twitter.com/BjLVmVn7Mh
— NDTV (@ndtv) September 12, 2026
‘నరేంద్ర మోడీతో జరిపిన అంతర్గత చర్చల్లో జకీర్ నాయక్ విషయం ప్రస్తావనకు వచ్చింది. జకీర్‌ను అప్పగించాలనే ఇండియా అభ్యర్థనపై మేము మా దేశంలోని చట్టాన్ని జాగ్రత్తగా అనుసరిస్తాం. చట్టాన్ని గౌరవించడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కూడా ముఖ్యమే. అయితే.. ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని భావించాం. రెండు దేశాల మధ్య నమ్మకం, అనుబంధం బలోపేతం చేయడానికి మేము తొలి ప్రాధాన్యం ఇచ్చాం’ అని మలేషియా ప్రధాని స్పష్టం చేశారు.
VIDEO | Delhi: PM Modi (@narendramodi) holds bilateral meeting with Prime Minister of Malaysia, Anwar Ibrahim, on the sidelines of BRICS Summit 2026.
(Source: Third Party)#BRICSUpdatesOnPTI#BRICS2026#BRICS#BRICSSummit#BRICSIndia pic.twitter.com/JMlydcYHK9
— Press Trust of India (@PTI_News) September 12, 2026
విద్వేష పూరిత ప్రసంగాలతో ముస్లిం యువతను రెచ్చగొట్టిన జకీర్ నాయక్‌పై భారత ప్రభుత్వం పలు క్రిమినల్ కేసులు పెట్టింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా అతడిపై, అతడి నెట్‌వర్క్‌పై విచారణ మొదలవ్వగానే.. అరెస్ట్ భయంతో జకీర్ 2016లో మలేషియాకు పారిపోయాడు. అప్పటి నుంచి అతడు అక్కడే శాశ్వత నివాసిగా ఉంటున్నాడు. పదేళ్లుగా అతడిని విచారించేందుకు తమకు అప్పగించాలని ఇండియా కోరుతోంది.
Zakir Naik, who faces multiple cases of money laundering and hate speech in India, invited by Qatar to preach Islam amid FIFA World Cup. Watch this report@MunishPandeyy with more details
Watch #5Live with @ShivAroor | #ZakirNaik pic.twitter.com/NmkdpsGyxm
— IndiaToday (@IndiaToday) November 21, 2022
అయితే.. సరైన ఆధారాలు సమర్పిస్తేనే జకీర్ విచారణకు చట్టపరమైన వేదిక ద్వారా సహకరిస్తామని మలేషియా చెబుతోంది. సరిపోను ఆధారాలు లేవని పేర్కొంటూ ఇంటర్‌పోల్ కూడా అతడిపై రెడ్ నోటీస్‌ను ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమావేశాల సందర్భంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ప్రధాని నరేంద్ర మోడీల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. దాంతో, త్వరలోనే జకీర్ అప్పగింతపై కీలక ముందుడుగు పడే అవకాశముంది.