తిరుమల : ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) కు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శుక్రవారం 31 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కల్పించామని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 72, 408 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
బెంగుళూరుకు చెందిన గిరియప్ప దయానంద అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా ( Donations ) అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.