Sitapuram | సీతారాంపురంలో దొంగల హల్చల్.. 16 తులాల బంగారం, 20 తులాల వెండి చోరీ..!
కారేపల్లి, సెప్టెంబర్ 26: ఇంటి తలుపులు పగలకొట్టిన గుర్తు తెలియని దుండగులు సుమారు 16 తులాల బంగారం,20 తులాల వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కారేపల్లి, సెప్టెంబర్ 26: కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో భారీ చోరీ కలకలం రేపింది. ఇంటి తలుపులు పగలకొట్టిన గుర్తు తెలియని దుండగులు సుమారు 16 తులాల బంగారం,20 తులాల వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు.
బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన కుప్పనూరి వెంకటరెడ్డి అనారోగ్యం కారణంగా మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. ఆపరేషన్ కోసమని ఆయనన అక్కడే చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. మరుసటి రోజు(శనివారం) ఉదయం వెంకటరెడ్డి సతీమణి ఇంటికి చేరుకుని చూడగా తలుపులు ధ్వంసమై కనిపించాయి. కంగారుపడిన ఆమె ఇంట్లోకి వెళ్లగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు కనిపించలేదు.
దాంతో, స్థానికుల సహాయంతో ఆవిడ కారేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దొంగతనం విషయం తెలిసి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఖమ్మం నుంచి క్లూస్ టీంను రప్పించి ఇంట్లోని పలు ప్రాంతాల్లో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యామని స్థానిక ఎస్సై బైరు గోపి తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

