Election Commission | ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే దేశవ్యాప్తంగా ‘సర్’: ఈసీ
Election Commission | ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీల ఏకగ్రీవ ఆమోదంతోనే ఆ ఆదేశం జారీ అయ్యిందని శనివారం పేర్కొంది.
న్యూఢిల్లీ: ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీల ఏకగ్రీవ ఆమోదంతోనే ఆ ఆదేశం జారీ అయ్యిందని శనివారం పేర్కొంది. (Election Commission) ‘సర్’ అంశంలో ఎన్నికల సంఘంలో విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు కమిషనర్లు శనివారం సమావేశమయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ ఒక ప్రకటన జారీ చేశారు. దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియతో సహా గత కొన్ని నెలల్లో తాము అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.
కాగా, బీహార్‌తో ప్రారంభించిన తర్వాత పశ్చిమ బెంగాల్, అనంతరం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ‘సర్’ ప్రక్రియ చేపట్టడానికి ముగ్గురు సభ్యల ఏకగ్రీవ ఆమోదంతోనే 2025 జూన్ 24న ఉత్తర్వు జారీ అయ్యిందని ఈసీ తెలిపింది. మే 27 నాటి ఉత్తర్వు ద్వారా సుప్రీంకోర్టు కూడా తమ ఆదేశాన్ని సమర్థించినట్లు పేర్కొంది. మూడవ దశ కింద మిగిలిన 12 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల తుది ప్రచురణ తర్వాతే ఓటర్ల తుది సంఖ్య తెలుస్తుందని ఈసీ వివరించింది. అలాగే ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడానికి ఉపయోగించే ‘ఫారం-6’లో చేసిన మార్పులను కూడా సుప్రీంకోర్టు సమర్థించినట్లు ఈసీ స్పష్టం చేసింది.
మరోవైపు ఇద్దరు కమిషనరైన సంధు, జోషిలు క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖలను కూడా ఎన్నికల సంఘం ప్రస్తావించింది. ఆ లేఖలు కమిషన్ లేదా దాని ఐటీ విభాగానికి సంబంధించిన ఏ విధానపరమైన విషయంతోనూ సంబంధం లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు డిప్యూటేషన్‌పై వచ్చిన ఒక అధికారి పనితీరుకు సంబంధించినవని పేర్కొంది. సంబంధిత అధికారి జారీ చేసిన పని పునర్విభజన ఉత్తర్వులు, ఇద్దరు కమిషనర్ల జోక్యం తర్వాత అమలు కాలేదని ఈసీ తెలిపింది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ద్వారా ఐటీ విభాగంపై పర్యవేక్షణను ఎన్నడూ ఉపసంహరించుకోలేదని పేర్కొంది.
దేశ వ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎన్నికల సంఘం పనితీరుకు సంబంధించిన నిర్ణయాలు, ఉత్తర్వులపై ఇద్దరు కమిషనర్లు పలు సందర్భాల్లో అభ్యంతరాలు లేవనెత్తారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా ‘సర్’ ప్రక్రియకు ఆమోదం తెలిపినట్లుగా వివరణ ఇచ్చేందుకు ఈసీ ప్రయత్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

