KCR Song | ‘మళ్లా రావాలి సార్ మీరే కేసీఆర్’ పాట విడుదల.. జొన్నొజి క్రియేషన్స్‌కు హరీశ్ రావు అభినందనలు..!
రాయపోల్, సెప్టెంబర్ 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలంతా మళ్లీ కోరుకుంటున్న వేళ ‘మళ్లా రావాలి సార్ మీరే కేసీఆర్’ పాటను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విడుదల చేశారు.
రాయపోల్, సెప్టెంబర్ 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలంతా మళ్లీ కోరుకుంటున్న వేళ ‘మళ్లా రావాలి సార్ మీరే కేసీఆర్’ పూర్తి పాటను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విడుదల చేశారు. శనివారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు ఈ పాటను ఆవిష్కరించారు. జొన్నోజి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ పాటను జొన్నోజి నాగులు రాశారు.
‘మళ్లా రావాలి సార్ మీరే కేసీఆర్’ అనే పాటను విడుదల చేసిన సందర్భంగా తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధిలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోషించిన పాత్రను గుర్తుచేసే విధంగా ఈ పాటను రూపొందించడం అభినందనీయమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ప్రజలు పాటను ఆదరించాలని ఆయన కోరారు. పాటను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా పాటను రూపొందించిన రచయిత జొన్నోజి నాగులను హరీశ్ రావు అభినందించారు. ప్రజలకు చేరువయ్యే విధంగా పాటను రూపొందించేందుకు కృషి చేసిన జొన్నోజి క్రియేషన్స్ ప్రతినిధులను కూడా ఆయన ప్రశంసించారు. జొన్నోజి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ పాటను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ‘మళ్లా రావాలి సార్ మీరే కేసీఆర్’ పాటను జొన్నోజి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాటను వీక్షించి ఆదరించాలని వారు కోరారు. పాట విడుదల కార్యక్రమంలో జొన్నోజి క్రియేషన్స్ ప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు అయ్యగల్ల రవి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

